AI in Education: ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ టీచింగ్

ఐటీ ఆధారిత భాగస్వామ్య పక్షాల తోడ్పాటుతో ఏఐ, డిజిటల్ బోధన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ముందడుగు పడిందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్‌స్టెప్ ఫౌండేషన్‌ను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం జనవరి 30న సందర్శించింది.
ఈ బృందంలో ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులు ఉన్నారు. ఎక్‌స్టెప్ ఫౌండేషన్ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలతో కలిసి స్కూళ్లలో డిజిటల్ విద్యను అందించేందుకు సహకారం అందిస్తోంది.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకనీ ఈ సంస్థకు కూడా కో–ఫౌండర్. ఈ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర బృందం.. విద్యారంగంలో చేపట్టాల్సిన వినూత్న కార్యక్రమాలపై చర్చించింది. ఫౌండేషనల్ లిటరసీ, న్యుమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్), ప్రాథమిక విద్యా స్థాయిలో ఏఐ ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా రాయడం, చదవడం, సంఖ్యా పరమైన విజ్ఞానాన్ని పెంపొందించే వీలుందని అధికారులు తెలిపారు.
![]() ![]() |
![]() ![]() |
ఉపాధ్యాయులలో వృత్తిపరమైన ప్రమాణాలను పెంపొందించడం, పాఠశాల గదుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి ఏఐ తోడ్పడుతుందని చెప్పారు. ఈ అధికారుల బృందం 2024 లో కేరళలో పర్యటించి విద్యా రంగంలో చేపట్టిన ఆధునిక పద్ధతులను పరిశీలించింది.
Tags
- government schools
- AI Teaching
- artificial intelligence
- AI and Digital Teaching
- School Education Department
- EV Narsimha Reddy
- EkStep Foundation
- Department of Education
- Yogita Rana
- Intermediate Education
- AI learning in government schools
- AI to train govt school teachers
- Online Training on Artificial intelligence
- AI in education
- Ai teaching in government schools in india
- Telangana News