Skip to main content

Education: పేద విద్యార్థుల చదువుకు భరోసా

ఇంద్రవెల్లి/ఉట్నూర్‌రూరల్‌: గిరిజన విద్యార్థులకు చదువు ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాలలు భరోసా కల్పిస్తున్నాయని ఎంపీ గోడం నగేశ్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు.
Ensuring the education of poor students  MP Godom Nagesh speaking about gurukula schools for tribal education  Community members gathering to support tribal education initiatives

అక్టోబర్ 2న‌ ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో కుష్బు గుప్తా, ఉట్నూర్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌లతో కలిసి ఇంద్రవెల్లి మండలంలోని పాటగూడ సమీపంలో, ఉట్నూర్‌ మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలో నిర్మించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

చదవండి: Vice Chancellor Posts: వైస్‌ చాన్స్‌లర్‌ పోస్టుల భర్తీ మరింత ఆలస్యం

ఈసందర్భంగా రిబ్బన్‌ కట్‌ చేసి పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

దసరా సెలవులు ముగిసిన వెంటనే పిల్లలను బడికి పంపాలన్నారు. కార్యక్రమంలో గురుకులం ఆర్‌సీవో కాంబ్లే అనిల్‌, ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్‌ స్వరాప్‌ యాదవ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రేఖరాణి, తదితరులు పాల్గొన్నారు.

Published date : 03 Oct 2024 01:44PM

Photo Stories