Teachers: ఉపాధ్యాయులు లేక పాఠశాలకు తాళం
ఈసందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: Teachers Adjustment: టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి
ఒక ఉపాధ్యాయుడు కాంప్లెక్స్ మీటింగ్‌కు వెళ్తే పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారని వాపోయారు. ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారని మండిపడ్డారు. మొత్తం ఏడు తరగతులకు ఏడుగురు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ధర్నా విషయం తెలుసుకున్న ఎంఈఓ దయాల్ రాములు, కాంప్లెక్స్ హెచ్‌ఎం తిమ్మారెడ్డి అక్కడికి చేరుకొని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి పాఠశాలకు వేసిన తాళం తీయించారు. ఆ పాఠశాల నుంచి రిలీవ్ అయిన ఒక ఉపాధ్యాయుడితో మాట్లాడి తొత్తినోనిదొడ్డి పాఠశాలలోనే మరికొంత కాలం పనిచేసే విధంగా కోరారు.