Skip to main content

Teachers Adjustment: టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి

మంచిర్యాల అర్బన్‌: పాఠశాల విద్య–ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) బాధ్యులు కోరారు.
Rationalization orders for teachers should be revised

సెప్టెంబ‌ర్ 26న‌ ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నంబర్‌ 25ను సవరించిన తర్వాత టీచర్లను సర్దుబాటు చేయాలన్నారు. బదిలీ అయి రిలీవ్‌ చేయని టీచర్లను వెంటనే రిలీవ్‌ చేసి పాఠశాలలో సర్దుబాటు చేయాలన్నారు.

చదవండి: World Teacher's Day : వ‌ర‌ల్డ్ టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు

బదిలీలు, పదోన్నతుల అప్పీళ్లను పరిష్కరించాలన్నారు. బోధనేతర పనులు, పాఠశాల పర్యవేక్షణ నిమిత్తం ప్రతీ ప్రాథమిక పాఠశాలలకు హెచ్‌ఎంలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రాజావేణు, జయకృష్ణ, నాగలక్ష్మి, కిరణ్‌, కుమారస్వామి, కళావతి, గంగాధర్‌, అంజనేయులు పాల్గొన్నారు.

Published date : 30 Sep 2024 05:03PM

Photo Stories