Special Classes: ‘పది’లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక బోధన!
ఏటూరునాగారం: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడానికి ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధన కార్యక్రమాలను చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కంట్రోల్ అధికారి బద్దం సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఉదయం ప్రారంభమవుతున్న పదో తరగతి బోధన ఏ విధంగా ఉందని పరిశీలించారు. పిల్లలకు అర్ధమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Download TS 10th Class Model Papers TM | EM
పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకావద్దని సమయస్ఫూర్తితో పరీక్షలు విజయవంతంగా రాయాలని విద్యార్థులకు సూచించారు. అర్థంకాని విషయాలపై ఉపాధ్యాయులను అడిగి అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నారు.
ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక బోధన తరగతులను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కంట్రోల్ అధికారి బద్దం సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాయకుల గూడెం, రంగరాజాపురం, వెంకటాపురం, నూగూరు, ఒంటిమామిడి పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరును ఆయన గురువారం పరిశీలించారు.
TS 10th Class మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు రోజువారీగా విద్యార్థులకు స్లిప్‌టెస్టులు నిర్వహించాలన్నారు. అభ్యసన దీపికలో ఇచ్చిన ప్రశ్నలకు విద్యార్థుల చేత సమాధానాలు రాయించి విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. ఉన్నతి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నెలవారి పరీక్షలు నిర్వహించి ఫలితాలను నమోదు చేయాలన్నారు. తొలిమెట్టు కార్యక్రమం అమలులో భాగంగా పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, సుజాత పాల్గొన్నారు.