TS TET 2024: ఇంగ్లిష్ కఠినం..సైన్స్ మధ్యస్థం
రెండు సెషన్లుగా పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో జరిగిన పరీక్షకు 17,231 మందిని కేటాయిస్తే, 13,110 మంది పరీక్ష రాశారు. 4,121 మంది గైర్హా జరయ్యారు. 76.08 శాతం హాజరు నమోదై నట్లు అధికారులు తెలిపారు.
రెండో సెషన్ మ ద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగింది. ఈ పరీక్షకు 17,205 మందికి అవకాశం కల్పించారు. వీరిలో 13,686 మంది పరీక్ష రాశారు. 79.55 శాతం హాజరు నమోదైంది. మొత్తంగా పేపర్–2కు తొలి రోజు 34,436 మంది పరీక్ష రాయాల్సి ఉంటే, 26,796 మంది హాజర య్యారు.
చదవండి: Singapore PM: సింగపూర్ ప్రధాని పదవిని వీడనున్న లీ సీన్ లూంగ్
7,640 మంది గైర్హాజర య్యారు. మొత్తంగా 77.81 శాతం హాజరు నమోదైంది. మేథ్స్ పేపర్ కొంత కఠినంగానే ఉందని విద్యార్థులు తెలిపారు. సైన్స్ మధ్యస్థంగా ఉందని, మొత్తంగా టెట్ కష్టంగానే ఉందని పలువురు వెల్లడించారు. కొత్త పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు వచ్చాయన్నారు.
తెలుగులో గ్రామర్, కవులపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని, సైకాలజీలో సాధారణంగానే ప్రశ్నలు ఇచ్చినట్లు తెలిపారు. ఇంగ్లిష్‌లోనూ కఠినంగానే ప్రశ్నలున్నాయని కొంతమంది చెప్పారు. మేథ్స్, సైన్స్ ప్రశ్నలను సిలబస్ పరిధిలోని అన్ని తరగతుల నుంచి ఇచ్చినట్లు విశ్లేషకులు వెల్లడించారు.