Skip to main content

Andhra Pradesh: వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తీపికబురు

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2018కి ముందు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన శాంక్షన్‌ పోస్టుల్లో నియమితులైన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్, పారా మెడికల్‌ సిబ్బందికి వంద శాతం గ్రాస్‌ వేతనం (పే+హెచ్‌ఆర్‌ఏ+డీఏ) పునరుద్ధరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సెప్టెంబర్‌ 14న ఉత్తర్వులు జారీ చేశారు.
Andhra Pradesh, Para-Medical Staff Salary Increase in AP, September 14th
వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తీపికబురు

 టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్‌ వేతనాన్ని రద్దు చేసి.. కన్సాలిడేట్‌ పేకి కుదించారు. ఈ నేపథ్యంలో వారంతా 2019కు ముందు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద శాతం గ్రాస్‌ వేతనం వర్తింపజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు.

ఈ హామీని నెరవేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 తర్వాత నియమించబడి అర్హత ఉన్న ఉద్యోగులకు ఈ వేతనాలు వర్తింపజేసేలా ప్రతిపాదనలు పంపించాల్సిందిగా విభాగాధిపతులను ఆదేశించారు.  

చదవండి:

Education Hub: ఎడ్యుకేషన్‌ హబ్‌గా రాజమహేంద్రవరం

Andhra Pradesh Jobs: చిత్తూరు జిల్లాలో పారా మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Published date : 15 Sep 2023 12:58PM

Photo Stories