Skip to main content

Telangana New Government Jobs 2023 : శుభ‌వార్త‌.. 14,954 కొత్త పోస్టులు మంజూరు.. శాఖల వారిగా ఖాళీల వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో శుభ‌వార్త‌ను చెప్పింది. వీఆర్‌ఏల సర్దుబాటు కోసం నూతన పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana New Government Jobs 2023 News Telugu
TS CM KCR

ఈ మేరకు వివిధ శాఖల్లో 14,954 కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఆయా పోస్టులకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విధంగా వీఆర్ఏలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

☛ Good News for Government Employees : ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్‌ఏలు.. ఉత్తర్వులు జారీ.. విధివిధానాలు ఇవే.. అలాగే జీతాలు కూడా..

వీఆర్‌ఏల డిమాండ్‌లకు తలొగ్గిన ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారిని సర్దుబాటు చేయడానికి నూతన పోస్టులను మంజూరు చేసింది. కొత్త పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు కూడా ఇప్పటికే ఇచ్చేసింది.

☛ టీఎస్‌పీఎస్సీ Group-1&2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తెలంగాణ‌లో శాఖల వారిగా పోస్టుల వివ‌రాలు ఇవే..

ts government jobs 2023 telugu news

☛ తెలంగాణ రెవెన్యూ శాఖలో 2,113  రికార్డ్ అసిస్టెంట్ నూతన పోస్టులను ఖరారు చేశారు. అలాగే రెవెన్యూ శాఖలో 679 సబార్డినేట్ కొత్త పోస్టులను సృష్టించారు.
☛ తెలంగాణ పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
☛ నీటిపారుదల శాఖలో 5,063 లష్కర్, హెల్పర్ పోస్టులు మంజూరు చేశారు.
☛ మిషన్ భగీరథ శాఖలో 3,372 హెల్పర్ నూతన పోస్టులను భర్తీ చేయనున్నారు.

☛ చ‌ద‌వండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ప‌రీక్షా విధానం ఇదే..

Published date : 04 Aug 2023 07:01PM

Photo Stories