TS Government Jobs : 10,028 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. ముందుగా ఈ పోస్టులకు..
వీటిలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే 10,028 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. వారం వారం విడతల వారీగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా ఒకట్రెండు రోజుల్లో ఎంబీబీఎస్ అర్హతతో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ మేరకు జూన్ 6వ తేదీన (సోమవారం) ఆయన మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లో 1,326 పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని హరీశ్ ఆదేశించారు.\
రెండుమూడు వారాల్లోనే..
పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, రెండుమూడు వారాల్లో విడతల వారీగానే నోటిఫికేషన్ల జారీ ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేత మహంతి, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సెక్రెటరీ గోపీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
పోటీ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
వీరికి 20% వెయిటేజి.. ఎందుకంటే..?
‘ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20% వెయిటేజి మార్కులు ఇవ్వాలి. ఆయుష్ విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. టెక్నికల్ పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను టీఎస్‌పీఎస్సీ.. నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్ బోర్డు.. మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి.
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
రాతపరీక్ష ఇలా..
స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి.. మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు కోవిడ్ కాలంలో పని చేసిన వారికి వెయిటేజి ఇవ్వాలి. ఆయుష్ డాక్టర్లను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఆ ఖాళీలను భర్తీ చేయాలి. ఆయుష్ సర్వీసు రూల్స్‌లో సవరణలు చేయాలి’అని సూచించారు.
80 శాతం మార్కులు..
తొలి నోటిఫికేషన్‌లో ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ మార్కులు, మిగతా 80 శాతం మార్కులు ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. తొలి విడత తర్వాత. వెంటనే స్టాఫ్ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి’అని హరీశ్ వివరించారు.
Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవే..
➤మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్(1520),
➤వైద్య విద్య హెచ్‌ఓడీ: అసిస్టెంట్ ప్రొఫెసర్ (1183),
➤స్టాఫ్ నర్స్ 3823,
➤ట్యూటర్ 357,
➤డైరెక్టర్ పబ్లిక్ హెల్త్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (751),
➤ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్‌ఓడీ : సివిల్ అసిస్టెంట్ సర్జన్ (7)
➤ఎంఎస్‌జె క్యాన్సర్ ఆసుపత్రి: స్టాఫ్ నర్స్(81)
Success Story: వేలల్లో వచ్చే జీతం కాదనీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..
తెలంగాణ వైద్య విధాన పరిషత్..
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ (211),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(బయోకెమిస్ట్రి– 8),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈఎన్‌టీ(33),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు ఫోరెన్సిక్ మెడిసిన్ (48),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్ (120),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ(126), సి
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ గైనకాలజీ (147),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (24),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ మైక్రోబయోలజీ(8),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆప్తామాలజీ(8),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆరోథపెడిక్స్(53),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్(142),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సైక్రియాట్రి(37),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ రేడియోలజీ(42),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్తీషియా(152),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ డెర్మటాలజీ(9),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పాథలోజీ(78),
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పల్మనరీ మెడిసిన్ (38),
➤మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్/ఎఎన్‌ఎం(265),
➤స్టాఫ్ నర్స్(757)
మొత్తం: 10,028
ఆయుష్ విభాగం హెచ్‌ఓడీ..
➤ఆక్సిలరీ నర్స్ మిడ్–వైఫ్(ఎ ఎన్‌ఎమ్–26),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్(14),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్(3),
➤ల్యాబ్ అసిస్టెంట్(18),
➤ల్యాబ్ టెక్నీషీయన్ (26),
➤లెక్చరర్ ఆయుర్వేద(29),
➤లెక్చరర్ హోమియో(4),
➤లెక్చరర్ యునాని(12),
➤లైబ్రెరీయన్ (4),
➤మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద(54),
➤మెడికల్ ఆఫీసర్ హోమియో(33),
➤మెడికల్ ఆఫీసర్ యునానీ(88),
➤ఫార్మాస్యూటికల్ కెమిస్ట్(9),
➤ఫార్మాసిస్ట్ ఆయుర్వేద(136),
➤ఫార్మాసిస్ట్ హోమియో(54),
➤ఫార్మాసిస్ట్ యునానీ(118),
➤స్టాఫ్ నర్స్(61)
మొత్తం: 689
డీఎంఈ హెచ్‌ఓడీ..
➤అనస్తీషీయా టెక్నినీషియన్ (93),
➤ఆడియో వీడియో టెక్నినీషియన్ (32),
➤ఆడియో మెట్రీ టెక్నినీషియన్ (18),
➤బయోమెడికల్ ఇంజనీర్(14),
➤బయోమెడికల్ టెక్నీషీయన్ (11),
➤కార్డియోలజీ టెక్నిషీయపన్ (12),
➤సీటీ స్కాన్ టెక్నీషీయరన్ (6),
➤డార్క్ రూమ్ అసిస్టెంట్(36),
➤డెంటల్ హైజెనీస్ట్(3),
➤డెంటల్ టెక్నీషీయన్ (53),
➤ఈసీజీ టెక్నిషీయన్ (4),
➤ఈఈజీ టెక్నీషీయన్ (5),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్(172),
➤ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్02(356),
➤ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(161),
➤ఫీజియోథెరెపిస్ట్(33),
➤రేడియోగ్రాఫర్(55),
➤రేడియోగ్రఫీ టెక్నీషియన్ (19),
➤ఆప్టోమెటరిస్ట్(20),
➤స్టెరిలైజేషన్ టెక్నీషీయన్ (15)
మొత్తం: 1118
డైరెక్టర్ పబ్లిక్ హెల్త్:
➤అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్(2),
➤డార్క్‌రూమ్ అసిస్టెంట్(30),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్(42),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్(4),
➤ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(119),
➤ఫార్మాసిస్ట్ గ్రేడ్02(160)
మొత్తం: 357
డ్రగ్స్ కంట్రోలర్:
➤డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్(18),
➤జూనియర్ అనాలిస్ట్(9),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్94),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్ట్(2)
మొత్తం: 33
ఐపీఎమ్(హెచ్‌ఓడీ):
➤ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (24),
➤జూనియర్ అనలిస్ట్ స్టేట్(9),
➤జూనియర్ అనలిస్ట్ జోనల్(2),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్(1),
➤జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లోకల్(5),
➤లాబోరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్(6),
➤లాబోరేటరీ టెక్నీషీయన్ గ్రేడ్ –2 స్టేట్ క్యాడర్(6),
➤శాంపిల్ టేకర్ లోకల్ క్యాడర్(3)
మొత్తం: 56
ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి:
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్తీషియా 1,
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ గైనిక్ ఆంకాలజీ–2,
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పెయిన్ అండ్ పల్లియేటివ్ కేర్–2,
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియో థెరపీ–3,
➤అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ అంకాలజీ–3,
➤బయోమెడికల్ ఇంజనీర్–1,
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ పాథాలోజీ–1,
➤సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్తీషీయా–1,
➤డెంటల్ టెక్నిషీయన్ –1,
➤ఈసీజీ టెక్నీషీయన్ –2,
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్–5,
➤ల్యాబ్ అసిస్టెంట్–8,
➤ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(5),
➤లెక్చరర్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ –1,
➤మెడికల్ ఫిజిసిస్ట్–5,
➤మెడికల్ రికార్డ్ టెక్నీషీయన్ –3,
➤ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(2),
➤రేడియో గ్రాఫర్(సీటీ టెక్నీషీయన్ –2),
➤రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ–1,
➤రేడియోగ్రాఫర్ ఎంఆర్‌ఐ టెక్నీషీయన్ –2,
➤రేడియో గ్రాఫర్ ఆర్‌టీ టెక్నీషీయన్ –5,
➤రేడియోగ్రాఫర్స్–6,
➤సోషల్ వర్కర్–6,
మొత్తం: 68
నిమ్స్:
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్–20,
➤టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ: ఏఈఈ/ఏఈ(11),
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1,
➤జూనియర్ టెక్నీకల్ ఆఫీసర్–1,
➤జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–1,
మొత్తం: 13
వైద్య విధాన పరిషత్:
➤డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (36),
➤జూనియర్ అసిస్టెంట్ లోకల్(63),
➤ల్యాబ్ టెక్నీషీయన్ (47),
➤ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(119),
➤రేడియోగ్రాఫర్(36)
మొత్తం: 301
కాలోజీ యూనివర్సీటీ:
➤అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్–1,
➤అసిస్టెంట్ లైబ్రేరియన్ –2,
➤జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1,
➤లైబ్రేరియన్ –1,
➤ప్రోగ్రామర్–1,
➤సీనియర్ సిస్టమ్ అనలిస్ట్–1
మొత్తం: 7
మొత్తం: 2662