Skip to main content

SCCL Exams Schedule 2024 : సింగ‌రేణిలో 327 పోస్టులు.. హాల్‌టికెట్లు, ప‌రీక్ష తేదీలు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : సింగరేణి యాజమాన్యం 327 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అయితే ఈ పోస్టుల‌కు రాత పరీక్షలను సింగరేణి యాజమాన్యం ఖరారు చేసింది.
SCCL Exams Schedule 2024  Notification of 327 posts by Singareni management  Computer-based tests scheduled for August 6 and 7  Hall tickets available for download  Exams conducted in three sessions per day  SingareniNotification

ఈ పోస్టుల‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగ‌స్టు 6, 7వ తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయని సంస్థ పేర్కొంది. రోజుకు మూడు సెషన్‌లలో పరీక్ష నిర్వహిస్తారు. త్వరలోనే విడుదల కానున్న హాల్‌టికెట్లను https://scclmines.com/ అధికారిక‌ వెబ్‌సైట్‌  నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో మొత్తం 327 పోస్టుల‌ను భర్తీ కానున్నాయి.

ఆగస్టు 6వ తేది అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) టీఅండ్‌ఎస్‌ గ్రేడ్‌ –సీ, జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ ట్రెయినీ, ఎలక్ట్రీషియన్‌ ట్రెయినీ కేటగిరీ– 1, ఫిట్టర్‌ కేటగిరీ –1 పరీక్షలను నిర్వహించనున్నారు. ఆగస్టు 7వ తేదీన మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఈఅండ్‌ఎం) ఈ –2 గ్రేడ్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (సిస్టమ్‌) ఈ–2 గ్రేడ్‌, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రెయినీ (మెకానికల్‌) టీఅండ్‌ఎస్‌ గ్రేడ్‌ – సీ పరీక్షలు జరగనున్నాయి.

singareni exam dates

 

Published date : 29 Jul 2024 09:35AM

Photo Stories