Jobs: తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల.. అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా సవరించిన తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేసినట్టు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి జనవరి 23న ప్రకటించారు.
తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో ఈ జాబితా అందుబాటులో ఉందని తెలిపారు. అభ్యంతరాలుంటే జనవరి 25 సాయంత్రం 5లోగా casrecruitmentdphfw2021@gmail.comకు మెయిల్ చేయాలని సూచించారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామన్నారు.