Skip to main content

High Court: అలా ఫీజు ఎలా పెంచుతారు?

తెలంగాణ అడ్మిషన్ అండ్‌ ఫీ రెగ్యులేషన్ కమిటీ (టీఎఎఫ్‌ఆర్‌సీ) సిఫార్సు చేయకుండా మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల ఫీజులను పెంచడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
High Court
అలా ఫీజు ఎలా పెంచుతారు?

హైకోర్టు పూర్వ న్యాయమూర్తి నేతృత్వంలోని టీఎఎఫ్‌ఆర్‌సీకి మాత్రమే పీజీ కోర్సుల ఫీజులను నిర్ణయించే అధికారం ఉందని తేలి్చచెప్పింది. ఈ నేపథ్యంలో టీఎఎఫ్‌ఆర్‌సీ సిఫార్సులు చేయకుండా జారీచేసిన జారీ చేసిన జీవో 41, 43లు చట్టవిరుద్ధమని, వీటిని కొట్టేస్తూ తీర్పునిచి్చంది. మెడికల్, డెంటల్‌ పోసు్ట్రగాడ్యుయేట్‌ కోర్సుల ఫీజులకు సంబంధించి 2016లో జారీచేసిన జీవో 29 ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని కళాశాలలను ఆదేశించింది. జీవో 29లో నిర్ధేశించిన మేరకు కాకుండా అదనంగా వసూలు చేసిన ఫీజును ఆయా కళాశాలలు 30 రోజుల్లో విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని, అలాగే కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధించి విద్యార్హతల సర్టిఫికెట్లను ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం జనవరి 19న తీర్పునిచ్చింది. టీఎఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు చేయకుండా 2017–2020 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్, డెంటల్‌ కోర్సుల ఫీజులు పెంచడాన్ని సవాల్‌ చేస్తూ హెల్త్‌కేర్‌ రీఫామ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్, ఉస్మానియా జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్ లతోపాటు మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. టీఎఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు లేకుండానే పీజీ మెడికల్, డెంటల్‌ కోర్సుల ఫీజులను భారీగా పెంచారని పిటిషనర్ల తరఫున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం టీఎఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు లేకుండా ఫీజులు పెంచడం చట్టవిరుద్ధమని తెలిపారు. 

చదవండి: 

Teaching English: ఒకటి నుంచి పదికి ఏకకాలంలో...

Schools: శిథిలావస్థ నుంచి ఆధునికత వైపు ప్రభుత్వ అడుగులు

Skill Training: స్కూల్ నుంచే నైపుణ్య శిక్షణ

Published date : 20 Jan 2022 04:27PM

Photo Stories