Skip to main content

Teaching English: ఒకటి నుంచి పదికి ఏకకాలంలో...

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను ఒకటవ తరగతి నుంచి టెన్త్ వరకూ ఒకేసారి ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Teaching English
అన్ని తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన

దీనిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేయాలని నిర్ణయించామన్నారు. ఇంగ్లిష్‌ మీడియం బోధనపై గతంలో తిరుపతిరావు కమిటీ చేసిన సిఫార్సుల్లో ముఖ్యమైన వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మంత్రి జనవరి 19న మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇంగ్లిష్‌ మీడియం నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయమని, అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. అన్ని తరగతులకు ఒకేసారి బోధన చేపట్టేందుకు సమాయత్తమయ్యే దిశగా ముందుకెళ్లాలని అధికారులను కోరినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణపైనా దృష్టి పెట్టామన్నారు.

35 శాతం బడుల్లో ముందుగా వసతులు

మన ఊరు– మన బడి పథకం పరిధిలోకి తొలిదశలో 35 శాతం పాఠశాలలను తీసుకొస్తామని సబిత తెలిపారు. 9,123 స్కూళ్లలో తొలి విడత అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని, 65 శాతం విద్యార్థుల హాజరు ఉండే స్కూళ్లనే ఎంపిక చేయాలని భావించినట్టు తెలిపారు. ఈ దశలో రూ.4 వేల కోట్ల వరకూ వెచి్చస్తామన్నారు. రెండు విడతలు కలిపి రూ.7,289 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు. పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన నాలుగు స్కూళ్లల్లో మరమ్మతులన్నీ నెలలో పూర్తయ్యాయని, ఇదే ఒరవడి రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందన్నారు. జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో టెండర్ల ప్రక్రియ ఉంటుందని, విద్యాకమిటీలు, గ్రామ పంచాయతీలు ఇందులో భాగస్వామ్యమవుతాయని తెలిపారు. పూర్వ విద్యార్థులు, విద్యారంగంపై ఆసక్తి ఉన్నవాళ్లు పాఠశాలల నిర్మాణానికి ముందుకొస్తే స్వాగతిస్తామని, ఆ స్కూల్‌ బిల్డింగులపై వారు చెప్పిన వాళ్ల పేర్లు పెట్టేందుకు అనుమతిస్తామన్నారు.

ప్రొఫెసర్ల వయో పరిమితి పెంపు లేనట్టే..

విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడున్న ప్రొఫెసర్ల 60 ఏళ్ల పదవీ విరమణ పెంపునకు ముఖ్యమంత్రి సమ్మతించలేదని సబిత తెలిపారు. కొత్త ప్రొఫెసర్ల నియామక విధానంపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరుగుతోందని, త్వరలో నిర్ణయం వెలువడవచ్చన్నారు.

చదవండి: 

Parents and Professionals: మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం ఈ భాష అవసరం..

Good News: ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణ

TRSMA, NISA: చదవడం కూడా కష్టమే.. రాసే నైపుణ్యాలు పడిపోయాయి

Published date : 20 Jan 2022 03:19PM

Photo Stories