Good News: ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణ
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఈ రెండు అంశాలపై సమగ్ర అధ్యయనం జరపడంతో పాటు విధివిధానాల రూపకల్పన కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కె.తారక రామారావుతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. వచ్చే శాసనసభా సమావేశాల్లో ఈ మేరకు నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. మరోవైపు నాణ్యమైన విద్యా బోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘మన ఊరు–మన బడి’ ప్రణాళిక అమలుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జనవరి 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి
- రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు.
- ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
- రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
చదవండి:
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన.. ‘‘మన ఊరు – మన బడి’’ ప్రణాళిక కోసం..!
TRSMA, NISA: చదవడం కూడా కష్టమే.. రాసే నైపుణ్యాలు పడిపోయాయి
English: నేటి తరానికి ఇంగ్లిష్ అవసరం.. శిక్షణ కార్యక్రమం ప్రారంభం