Teacher Transfers: అయోమయం!.. బదిలీ అయినప్పటికీ.. వారిని రిలీవ్ చేయలేదు
ఇంకా 229 మందిని రిలీవ్ చేయలేదు. 2021లో విడుదలైన రేషనలైజేషన్ జీఓ 25 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 10లోపు విద్యార్థులుంటే ఒకరు, 11 నుంచి 40 వరకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని నిబంధన ఉంది.
విద్యార్థులుండి ఉపాధ్యాయులు బదిలీలలో కొత్త వారు రాకుంటే పాత వారిని రిలీవ్ చేయలేదు. దీంతో బదిలీ అయినప్పటికీ పాత స్థానంలోనే 229 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. రిలీవ్ చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
చదవండి: Dr VS Alagu Varshini: ప్రతి గురుకులంలో టెలిఫోన్!.. విద్యార్థి నేరుగా కార్యదర్శితో మాట్లాడొచ్చు
దక్కని ప్రయోజనం
పలువురు ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ కొ త్త స్థానంలో జాయిన్ కాకపోవడంతో ప్రయోజనం దక్కడం లేదు. బదిలీ ఉత్తర్వులు వచ్చి రెండు వారాలు కావస్తున్నా వారిని రిలీవ్ చేయడం లేదు.
పాఠశాలకు, ఇంటికి దగ్గరలో బ దిలీ అయ్యామన్న ఆనందం దక్కడం లేదు. రిలీవ్ చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
- బదిలీ అయినా రిలీవ్ చేయని విద్యాశాఖ
- పాత స్థానాల్లోనే కొనసాగుతున్నఉపాధ్యాయులు
- జిల్లాలో 229 మంది పాత చోటే విధులు
- డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వైనం