Skip to main content

English: నేటి తరానికి ఇంగ్లిష్‌ అవ‌స‌రం.. శిక్షణ కార్యక్రమం ప్రారంభం

Telangana education minister sabitha indra reddy speech over education sector
Telangana education minister sabitha indra reddy speech over education sector
  • ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ 
  • శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి సబిత 

మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టు విద్యా రంగంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, మౌలిక సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంపై పట్టు సాధించేందుకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాన్ని డిసెంబ‌ర్ 7న తన కార్యాలయం నుంచి మంత్రి ప్రారంభించారు.

ఉద్యోగుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్

పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నారని, దీన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని చెప్పారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. టీచర్లు వృత్తిపరమైన సామర్థ్యం పెంచుకునేందుకు శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ బోధనతో ఉపాధ్యాయులు చేసిన కృషిని మంత్రి అభినందించారు.

 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 09 Dec 2021 01:11PM

Photo Stories