Telangana Govt: ప్రభుత్వ సంస్థలు, హాస్టళ్లకు ‘ఈ డెయిరీ’ ఉత్పత్తులు
విజయ తెలంగాణ పాలు, పాల ఉత్పత్తులే కాక తాగునీరు(ప్యాకేజ్డ్) ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు పంపిణీ చేయాలని ప్రభుత్వ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ పేరిట తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార ఫెడరేషన్ ద్వారా రైతులకు గౌరవమైన ధర చెల్లించి పాలు సేకరిస్తుండగా, ప్రభుత్వం లీటర్‌కు ప్రోత్సాహకంగా రూ.4 చొప్పున చెల్లిస్తోందని...ఆపై ఆయా ధరలకు అనుగుణంగానే తిరిగి వినియోగదారులకు పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నందున ప్రభుత్వ సంస్థలకు సైతం పంపిణీ చేసేలా అనుమతించాలని డెయిరీ ఎండీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
దీంతో టెండర్ల విధానం ద్వారా జూలై నుంచే కొనుగోలు, సరఫరాకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ కార్యదర్శి ఆదేశించారు.
చదవండి:
Amul Milk: విదేశీ మార్కెట్లలో అమూల్ పాలు.. తొలిసారిగా ఇక్కడే!
తెలంగాణలోని ఏ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ మెగా డెయిరీని ఏర్పాటు చేయనున్నారు?
Tags
- Telangana Dairy Industry Development Cooperative Federation
- Vijaya Dairy
- Telangana Government
- Vijaya Milk
- Vijaya Water
- Sabyasachi Ghosh
- Telangana News
- Telangana Dairy
- Milk Products
- Government Institutions
- hostels
- Vijaya Telangana Milk
- Packaged Drinking Water
- government schools
- SakshiEducationUpdates