తెలంగాణలోని ఏ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ మెగా డెయిరీని ఏర్పాటు చేయనున్నారు?
Sakshi Education
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల వద్ద గ్రీన్ ఫీల్డ్ మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
ఈ మేరకు శాసనసభలో సెప్టెంబర్ 15న వెల్లడించారు. విజయ డెయిరీకి బ్రాండింగ్ కల్పిస్తామని, ఏడాది నాటికి 500 విజయ పార్లర్లను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వివరించారు. గద్వాలలో విజయ డెయిరీ త్వరలో ఏర్పాటు పేర్కొన్నారు. 2.13 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించడానికి ప్రభుత్వం పాడి పశువుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రీన్ ఫీల్డ్ మెగా డెయిరీ ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
ఎక్కడ : రావిర్యాల, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రీన్ ఫీల్డ్ మెగా డెయిరీ ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
ఎక్కడ : రావిర్యాల, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా
Published date : 16 Sep 2020 05:17PM