Amul Milk: విదేశీ మార్కెట్లలో అమూల్ పాలు.. తొలిసారిగా ఇక్కడే!
Sakshi Education
అమూల్ తాజా పాలు వారం రోజుల్లో అమెరికాలో లభించనున్నాయి.
- అమూల్ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్ ఎన్ ట్రిమ్ వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి.
- మిషిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎంఎంపీఏ)తో భాగస్వామ్యం.
- న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్‌లో మొదట అందుబాటులోకి రానున్నాయి.
- 3-4 నెలల్లో బ్రాండింగ్, మార్కెటింగ్‌పై దృష్టి.
వివరాలు:
- గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఎండీ జయేన్ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు.
- దశాబ్దాలుగా డెయిరీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం, కానీ తాజా పాలను భారత్ వెలుపల ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు.
- 108 ఏళ్ల చరిత్ర గల ఎంఎంపీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.
- పాల సేకరణ, ప్రాసెసింగ్ ఎంఎంపీఏ చేపడుతుంది, మార్కెటింగ్ జీసీఎంఎంఎఫ్ చూసుకుంటుంది.
- రాబోయే రోజుల్లో పనీర్, పెరుగు, మజ్జిగ వంటి ఉత్పత్తులను కూడా విదేశాలకు ఎగుమతి చేయాలని జీసీఎంఎంఎఫ్ యోచిస్తోంది.
- జీసీఎంఎంఎఫ్ ఇప్పటికే 50 దేశాలకు పాల ఉత్పత్తలను ఎగుమతి చేస్తోంది.
Star Streams: పురాతన నక్షత్రాల ప్రవాహాలను గుర్తించిన గియా టెలిస్కోప్!!
Published date : 26 Mar 2024 12:29PM