Skip to main content

62 Jobs: మెడికల్‌ కళాశాలలో 62 పోస్టుల భర్తీకి ఆదేశాలు

మహబూబ్‌నగర్‌ క్రైం: పాలమూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Instructions for filling 62 posts in Medical College

మొత్తం 62 పోస్టులను భర్తీ చేయడానికి హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయంలో మార్చి 16న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇందులో ప్రొఫెసర్‌ 3, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 16, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 12, సీనియర్‌ రెసిడెంట్స్‌ (ఎస్‌ఆర్‌) 11, ట్యూటర్స్‌ 20 పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

చదవండి: Medical Jobs: మెడికల్‌ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఎంపికై న వారిలో ప్రొఫెసర్లకు రూ.1,90,000, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు రూ.1,50,000, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు రూ.1,25,000, ఎస్‌ఆర్‌లకు రూ.92,575, ట్యూటర్లకు రూ.55,000 వేతనం చెల్లిస్తారు.
 

Published date : 14 Mar 2024 05:13PM

Photo Stories