DSC 2023 Notification: నిరుద్యోగుల్లో డీఎస్సీ ఆశలు
టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రెండ్రోజుల్లో విడుదల చేయనున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఉద్యోగాల భర్తీని టీఎస్‌పీఎస్‌సీ టీఆర్టీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017 టీఆర్‌టీ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు కేసుల కారణంగా రెండేళ్లకు పోస్టుల భర్తీ అయ్యాయి. తర్వాత నోటిఫికేషన్ ఇవ్వలేదు.
జిల్లాలో 472 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. ఈ క్రమంలో ఆగస్టు 24న మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన డీఎస్సీ ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేకేత్తిస్తోంది.
చదవండి: Teacher Jobs: ఖాళీల్లో మూడో వంతే భర్తీ.. ఏడాది క్రితం లెక్క తేల్చిన ఖాళీలివీ..
పోస్టుల భర్తీ ఇలా..
2017లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ద్వారా టీఆర్‌టీ నోటిఫికేషన్ ఇచ్చారు. న్యాయపరమైన సమస్య తలెత్తడంతో పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టెట్ అర్హత సాధించే నిబంధనలున్నాయి.
డీఎస్సీ రాయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరి కావడంతో 2022 జూన్ 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. జిల్లాకు చెందిన అభ్యర్థులు పేపర్–1 పరీక్ష 11,161 మందికి గాను 10,360 మంది రాయగా 3,897 మంది అర్హత సాధించారు. పేపర్–2లో 7,932 మందికి గాను 7,284 మంది పరీక్షకు హాజరు కాగా 4,060 అర్హత సాధించారు.
చదవండి: DSC Notification 2023: 6,612 పోస్టుల భర్తీ.. భర్తీ చేసే పోస్టులు ఇవీ..
ఇప్పటికే జిల్లాలో 472 ఖాళీలు ఉన్నట్లు లెక్కతేల్చి ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో పదోన్నతి ఖాళీలు, రిక్రూట్‌మెంటు ఖాళీలు ఉంటాయి. ఎట్లా తీసుకుంటారు..? ఎలా అనేది స్పష్టత లేకుండా పోయింది. ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. విధి విధానాలు వస్తే గానీ స్పష్టత రాదని ఓ అధికారి తెలిపారు.