AP Anganwadi Jobs 2023 : అంగన్‌వాడీ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా వ్యాప్తంగా 40 అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ పోస్టుల భర్తీకి కలెక్టర్ గౌతమి నోటిఫికేషన్ విడుదల చేశారు.
AP Anganwadi Jobs Notification2023
అనంతపురం అర్బన్ ప్రాజెక్టులో 2, శింగనమల 3, నార్పల 5, తాడిపత్రి 3, గుత్తి 6, ఉరవకొండ, 8, కళ్యాణదుర్గం 2, కణేకల్లు 5, కంబదూరు 3, రాయదుర్గం ప్రాజెక్టులో 3 చొప్పున ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అర్హులైన అభ్యర్థులు జూలై 13వ తేదీన (గురువారం) నుంచి ఏడు రోజుల్లోగా సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఖాళీల వివరాలు, దరఖాస్తుకు మార్గదర్శకాల గురించి ప్రాజెక్ట్ కార్యాలయాల నోటీసు బోర్డులో అతికించినట్లు పేర్కొన్నారు.