Skip to main content

AP CM YS Jagan Mohan Reddy : అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ పోస్టుల‌తో పాటు.. మహిళా శిశుసంక్షేమశాఖలోని ఖాళీలను కూడా వెంట‌నే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఏప్రిల్ 20వ తేదీన‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ap cm ys jagan mohan reddy details in telugu
ap cm ys jagan mohan reddy

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ..  ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం ఆదేశించారు. అలాగే మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా వెంట‌నే భర్తీచేయాలన్నారు.

☛ Andhra Pradesh: 63 CDPO ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌.. అలాగే ఈ పోస్టుల‌ను కూడా..

ఈ సమీక్ష స‌మావేశంలో సీఎం జగన్ ఏమ‌న్నారంటే.. 

ap cm ys jagan mohan reddy today news telugu

☛ మిగిలిన సుమారు 45వేల అంగన్‌వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలన్న సీఎం
☛ ఫౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకుపైగా అంగన్‌వాడీల్లో పనులు జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు
☛ అంగన్‌వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం
☛ ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం.
☛ ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలన్న సీఎం
☛ పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలన్న సీఎం
☛ గ్రోత్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్న సీఎం

☛ ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీచేయాలని సీఎం ఆదేశం.
☛ మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీచేయాలన్న సీఎం. 
☛ సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలన్న సీఎం. 
☛ పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలన్న సీఎం. 
☛ క్రమం తప్పకుండా అంగన్‌వాడీలపై పర్యవేక్షణ జరగాలన్న సీఎం.
☛ ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
☛ అంగన్‌వాడీల్లో సూపర్‌ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలన్న సీఎం. 

   ఈ సమావేశానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ వీరపాండ్యన్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ అహమ్మద్‌ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఎం విజయ సునీత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

☛ ☛ ఇలా ప్రిపేర్ అయితే ' CDPO ' ఉద్యోగం మీదే..

 

☛➤ CDPO ఉద్యోగాలు ప్రత్యేకం | CDPO Previous Questions Analysis | Part-1

☛➤ CDPO ఉద్యోగాలు ప్రత్యేకం | CDPO Previous Questions Analysis | Part-2

☛➤ CDPO ఉద్యోగాల ప్రత్యేకం | ఆహార శాస్త్రం & పోషణ- 01 | Food Science & Nutrition

Published date : 20 Apr 2023 05:15PM

Photo Stories