Skip to main content

DME: వైద్య విద్యావిభాగంలో 8 కొత్త కొలువులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యావిభాగంలో కొత్తగా ఎనిమిది పోస్టులను మంజూరు చేసింది.
DME
వైద్య విద్యావిభాగంలో 8 కొత్త కొలువులు

ఈ మేరకు మార్చి 24న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ వైద్య విద్యాసంచాలకులు (డీఎంఈ), వైద్య విద్యాసంచాలకులు(డీఎంఈ) అకడమిక్‌ పోస్టులను మంజూరు చేసింది. వాటికి పేస్కేల్‌ రూ.1.49 లక్షల నుంచి రూ. 2.24 లక్షలుగా నిర్ణయించింది. రెండు అదనపు డీఎంఈ పోస్టులు మంజూరు చేసింది. అందులో ఒకటి సాధారణం కాగా, మరోటి పరిపాలనకు కేటాయించింది. జాయింట్‌ డైరెక్టర్‌(పరిపాలన), జాయింట్‌ డైరెక్టర్‌(మెడికల్‌), డిప్యూటీ డైరెక్టర్‌(నర్సింగ్‌), అసిస్టెంట్‌ డైరెక్టర్‌(నర్సింగ్‌) పోస్టులను మంజూరు చేసింది. వీటి పేస్కేళ్లను కూడా నిర్ణయించింది. ఆయాపోస్టులను సరీ్వసు నిబంధనల ప్రకారం నింపాలని ప్రభుత్వం ఆదేశించింది.

చదవండి: వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ.. భర్తీ చేసే పోస్టులు ఇవే..

రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల తర్వాత వైద్య విద్యావిభాగానికి సంచాలకులు, అడిషనల్‌ డైరెక్టర్, జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టులు మంజూరు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆ పోస్టుల్లో ఇన్‌చార్జీలు కొనసాగుతున్నారు. కొత్తగా పోస్టులు మంజూరు చేయడంవల్ల సీనియారిటీ, అర్హత ఆధారంగా వాటిని భర్తీ చేస్తారు. కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలు స్థాపిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు రావటం శుభసూచకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త పోస్టులు మంజూరు చేయడంపట్ల తెలంగాణ టీచింగ్‌ వైద్యు­ల సంఘం అధ్యక్షకార్యదర్శులు డాక్టర్‌ అన్వర్, డాక్టర్‌ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్‌ కిరణ్‌ మాదల హర్షం వ్యక్తం చేశారు. 

చదవండి: వైద్య శాఖలో నియామకాలకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ బోర్డు

Published date : 25 Mar 2023 01:09PM

Photo Stories