Skip to main content

వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ.. భర్తీ చేసే పోస్టులు ఇవే..

సాక్షి, అమరావతి: గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్లను నియమిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించబోతోంది.
Walk in Interview for Medical Posts
వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ.. భర్తీ చేసే పోస్టులు ఇవే..

ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ)లో ఖాళీగా ఉన్న(319), ప్రమోషన్ల వల్ల ఖాళీ అయ్యే(126) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి మార్చి 23 నుంచి 27 వరకు వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు చేపడుతోంది. శాశ్వత, కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. ఇదే క్రమంలో ఏపీవీవీపీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు రెండుసార్లు వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇప్పుడు మరోసారి వాక్‌–ఇన్‌ ఇంటర్వూ్యలు చేప­డుతోంది.

చదవండి: వైద్య శాఖలో నియామకాలకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ బోర్డు

విజయవాడలోని పాత జీజీహెచ్‌ ప్రాంగణంలో ఉన్న డీఎంఈ కార్యాలయంలో ఈ ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. 23వ తేదీన జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, ఫోరె­న్సిక్‌ మెడిసిన్, డెర్మటాలజీకి సంబంధించి, 25వ తేదీన గైనకాలజీ, ఈఎన్‌టీ, అనస్తీషియా, పాథాలజీకి సంబంధించి, 27న పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ పోస్టులకు ఇంటర్వూ్యలు జరుగుతాయి. గిరిజన ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంత ఆస్పత్రుల్లో రూ.1.30 లక్షల చొప్పున వైద్యులకు వేతనాలు ఇవ్వనున్నారు. గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్లను నియమించే ఉద్దేశంతో ప్రభుత్వం అధిక వేతనాలు ఇస్తోంది. మరిన్ని వివరాల కోసం  www.hmfw.ap.gov.inను సందర్శించాలని, 6301138782 ఫోన్‌ నంబర్‌ను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. 

చదవండి: ఈ శాఖలో 1,610 కొత్త పోస్టుల సృష్టి

భర్తీ చేసే వైద్యుల పోస్టులు 

గైనకాలజీ

68

అనస్తీషియా

52

పీడియాట్రిక్స్‌

40

జనరల్‌ మెడిసిన్‌

94

జనరల్‌ సర్జరీ

70

ఆర్థోపెడిక్స్‌

5

  ఆప్తమాలజీ 

12

రేడియాలజీ

44

పాథాలజీ

19

ఈఎన్‌టీ

24

డెర్మటాలజీ

8

మైక్రోబయాలజీ

2

ఫోరెన్సిక్‌ మెడిసిన్‌

6

సైకియాట్రీ 

1

మొత్తం

445

Published date : 21 Mar 2023 04:30PM

Photo Stories