Skip to main content

Success Story : యూట్యూబ్ పాఠాలే.. ఫాలో అయ్యా.. స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..

ఈమె ఒక సాధార‌ణ రైతు కుటుంబంలో పుట్టారు. ఈమె ల‌క్ష్యం ఎప్పుడు ఉన్న‌తంగానే ఉండేది. ఈ ల‌క్ష్యన్ని.. సాధించే వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈమే ఆగ్రాకు చెందిన దివ్య సికర్వార్‌. చాలా మంది మొదటి ప్రయత్నంలో విజయం రాకపోతే నిరుత్సాహ పడిపోతారు.
Divya Sikarwar UPPSC State Top Ranker Success Story in telugu
Divya Sikarwar, UPPSC State Top Ranker Success Story

అతి తక్కువ మందే అనుకున్నది సాధించే వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఆగ్రాకు చెందిన దివ్య సికర్వార్‌ ఈ కోవకే చెందుతుంది. ఈమె నేడు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికై అంద‌రి అభినంద‌న‌లు పొందుతుంది. ఈ నేప‌థ్యంలో దివ్య సికర్వార్ స‌క్సెస్ స్టోరీ మీకోసం.. 

☛➤ TSPSC Group 1 Mains : గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో తండ్రీ కొడుకులు పాస్‌.. మెయిన్స్‌కు ఇలా..

కుటుంబ నేప‌థ్యం : 
ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఆగ్రా సమీపంలోని గర్హి రామి గ్రామానికి చెందిన వారు దివ్య సికర్వార్. ఈమె తండ్రిది రైతు కుటుంబం. ఆయన ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉన్నారు. ఆమె సోదరుల్లో ఒకరు ప్రస్తుతం యూపీఎస్సీ (UPSC) ప‌రీక్ష‌ల‌కు సిద్ధమవుతున్నారు. 

ఎడ్యుకేష‌న్ :
దివ్య.. 10వ తరగతిలో 77%, 12వ తరగతిలో 80% మార్కులు సాధించింది. అలాగే ఆగ్రాలోని సెయింట్ జాన్స్ కాలేజీలో సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.

Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

యూట్యూబ్ పాఠాలే గైడెన్స్‌గా.. చ‌దివి

Divya Sikarwar duputy colleter story in telugu

దివ్య.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే.. యూపీపీఎస్సీ పీసీఎస్‌-2022 పరీక్షలో టాపర్‌గా నిలిచి.. డిప్యూటీ కలెక్టర్‌గా సెలక్ట్‌ అయింది. గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆమెకు సివిల్ సర్వీస్‌పై ఆసక్తి కలిగింది. ఈ క్రమంలో మూడుసార్లు యూపీపీఎస్సీ పీసీఎస్ (UPPSC PCS) ప‌రీక్ష‌లు రాసింది.

☛ IAS Success Story : ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్.. చివ‌రికి ఐఏఎస్‌ కొట్టానిలా..

మొదట 2020లో, ఆ తర్వాత 2021లో ప‌రీక్ష‌లు రాసింది. ప్రస్తుతం మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. ఈమె యూట్యూబ్ పాఠాలే గైడెన్స్‌గా ప్రిపేర్ అయ్యారు.

నా ప్రిపరేషన్ ఇలా..

Divya Sikarwar deputy collector story in telugu

దివ్య.. పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు.. కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించేందుకు ప్రతిరోజూ న్యూస్‌ పేపర్లు చదివేది. ఈ ఎగ్జామ్‌ గురించి, ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే సమాజంలో తీసుకురాగలిగే మార్పు గురించి తెలుసుకుంటూ దివ్య ప్రేరణ పొందేది.

☛ Women IPS Success : త‌గ్గేదెలే.. ట్రైనింగ్‌లోనూ పురుషులతో స‌మానంగా..నిలబడ్డారు.. యువ లేడీ ఐపీఎస్‌లు.. వీరి స‌క్సెస్ జ‌ర్నీ ఇలా..

పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి చాలా సమయం, కృషి అవసరం. ప్రిలిమినరీ పరీక్ష సమయంలో ప్రతి సబ్జెక్టుకు సమాన సమయాన్ని కేటాయించింది. ప్రతిరోజూ 8 నుంచి 10 గంటల వరకు ఎగ్జామ్‌కి ప్రిపేర్‌ అయింది. ఇందులో తరగతులకు హాజరు కావడం, సెల్ఫ్‌ ప్రిపరేషన్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ కోసం రైటింగ్‌ ప్రాక్టీస్‌ వంటివి ఉన్నాయి. పరీక్షకు సిద్ధం కావడానికి ఆమె కూడా అన్‌అకాడమీలో చేరింది. ఈ యూట్యూబ్ ఛానల్‌ గైడెన్స్‌ ఆమె సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించింది.

నా ఇంటర్వ్యూ ఇలా.. 

Divya Sikarwar deputy collector story

యూపీపీఎస్సీ పీసీఎస్‌ పరీక్షల్లో చివరి ఇంటర్వ్యూ రౌండ్ సెలక్షన్‌ ప్రాసెస్‌లో కీలకమైన భాగం. దివ్య సికర్వార్ ఇంటర్వ్యూ రౌండ్‌లో పాజిటివ్‌ ఆట్టిట్యూడ్‌తో సమాధానాలు ఇచ్చింది. ఇంటర్వ్యూలో చూపిన కాన్ఫిడెన్స్‌, యూపీపీఎస్సీ పీసీఎస్ 2022 పరీక్షలో ఫస్ట్‌ ర్యాంక్ సాధించడంలో ఆమెకు సహాయపడింది.

☛➤ Poorna Sundari IAS Success Story : కంటి చూపు లేకపోతే ఏమి.. ఆత్మ విశ్వాసం ఉంటే చాలు క‌దా.. ఆడియోలో వింటూ.. ఐఏఎస్ కొట్టానిలా..

నా ల‌క్ష్యం ఇదే..

Divya Sikarwar deputy collector news in telugu

యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలు.., వారి నేపథ్యం లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా కృషి, అంకితభావం, పట్టుదలతో కోరుకున్నది సాధించగలరని దివ్య నమ్ముతుంది. ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ముందుటాన‌న్నారు. అలాగే ఇతరులకు సరైన తోడ్పాటు అందించడమే తన లక్ష్యమని దివ్య చెప్పింది.

☛➤ IAS Success Story : కూలీనాలీ చేస్తూ చ‌దివాడు.. ఐఏఎస్ సాధించాడు.. కానీ ఈయ‌న పెళ్లి మాత్రం..

Published date : 19 Apr 2023 12:00PM

Photo Stories