Women IPS Success : తగ్గేదెలే.. ట్రైనింగ్‌లోనూ పురుషులతో సమానంగా..నిలబడ్డారు.. యువ లేడీ ఐపీఎస్‌లు.. వీరి సక్సెస్ జర్నీ ఇలా..
కూతుళ్లను ఉన్నతంగా చూడాలన్న ఆ తల్లిదండ్రుల ఆశయాలను.. మహోన్నతంగా తమ విజయంతో చాటారు ఈ యువ ఐపీఎస్ అధికారిణులు. తగిన ప్రోత్సాహం అందిస్తే.. తామేంటో చూపిస్తామని నిరూపించారు.
☛ IAS Success Story : జీవితాన్ని ఇలా చూస్తే.. ఏదైనా ఈజీనే.. ఫెయిల్ అయితే..
సమాజంలో అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపిక కావడమే కాదు.. ట్రైనింగ్‌లోనూ తాము సివంగులమని పురుషులతో కలబడి నిలబడ్డారు. బెస్ట్ ఔట్‌డోర్ ట్రోఫీని దక్కించుకున్నారు. ప్రజాసేవలోకి తొలి అడుగు పెట్టబోతున్న మహిళా ఐపీఎస్ అధికారులు సక్సస్ జర్నీలు మీకోసం..
అప్పటి నుంచే ఐపీఎస్ కావాలని నిశ్చయించుకున్నా.. : శేషాద్రిని రెడ్డి, ఐపీఎస్
నా పేరు శేషాద్రి రెడ్డి... మా నాన్న సుధాకర్‌రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంతో ప్రో త్సహించేవారు. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్‌గా ప్రజలకు ఎంత సేవ చేసే అవకాశం ఉంటుంది..వాళ్లకు సమాజంలో ఎంత గౌరవం ఉంటుందన్నది బాగా చెప్పేవారు. అది నాలో ఎంతో ప్రేరణ నింపింది. అలా చిన్ననాటి నుంచే నేను ఐపీఎస్ కావాలని నిశ్చయించుకున్నా. ముందు నుంచి నేను ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ వచ్చాను. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రిపరేషన్ పై మరింత ఫోకస్ పెట్టాను.
☛ IAS Success Story : ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్.. చివరికి ఐఏఎస్ కొట్టానిలా..
సొంత రాష్ట్రంలోనే..
అమ్మా నాన్నల సహకారం నా కష్టంతో చివరకు విజయం సాధించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన నాకు మళ్లీ తెలంగాణ కేడర్‌లో సొంత రాష్ట్రంలోనే సేవ చేసే అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది. తెలంగాణలో పోలీస్ టెక్నాలజీ పరంగా, ఇతర అంశాల్లోనూ ఎంతో బాగున్నాయి. ఇప్పటికే మా సీనియర్ అధికారులు అమలు చేస్తున్న విధానాలను తెలుసుకుంటూనే ప్రజలకు పోలీసింగ్ మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తాను. భవిష్యత్తులో మరింతగా పెరగనున్న సైబర్ నేరాలను ఎలా కట్టడి చేయాలన్న దానిపైన మాకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అది మరింత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను.
మీకెవరు స్ఫూర్తి.. అంటే..?
నేను కోరుకున్నట్టుగా ఐఏఎస్ దక్కలేదు కానీ ఐపీఎస్ వచ్చింది. రెండింటికీ ప్రజాసేవే లక్ష్యం కదా. అందుకే సంతోషంగా శిక్షణ తీసుకున్నా. మీకెవరు స్ఫూర్తి? అని చాలామంది అడుగుతుంటారు. నాకెదురయ్యే ప్రతి వ్యక్తి నుంచీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాను. అమ్మానాన్న, స్నేహితులు.. నాకు తెలియనివెన్నో నేర్పారు. ఆడవాళ్లం అనే కారణంతో భయపడి వెనుకడుగు వేయకూడదు. అనుకున్నది సాధించడానికి ప్రయత్నం ఆపకూడదు. ప్రస్తుతం సైబర్‌క్రైం ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపై పనిచేయాలని ఉంది.
మూడుసార్లు ఫెయిల్.. అయినా నేనే ఫస్ట్.. : అంకిత సురాన, ఐపీఎస్
మా కుటుంబంలో చాలా మంది బిజినెస్‌లోనే ఉన్నారు. కానీ, నాకు మాత్రం ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో ఉండాలని కోరిక .. అందుకే నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అలా నాల్గో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మా సొంత ప్రాంతం మహారాష్ట్ర. కానీ, మా కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. నాన్న బిజినెస్‌లో ఉన్నారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుంచి బీఎస్సీ బయో కెమిస్ట్రీ పూర్తి చేశాను.
☛➤ IPS Success Story : రూ.20 లక్షల ప్యాకేజీకి టాటా చెప్పింది.. ఐపీఎస్‌కు వెల్‌కమ్ చెప్పిందిలా..
మూడుసార్లు విజయం రాకపోయినా..
ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. లక్ష్యంపై స్థిరంగా ఉన్నాను.. అందుకే మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాల్గో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. నేను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యాను. అక్కడి ప్రభుత్వం మహిళా భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి విన్నాను.ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో జిల్లాల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నా. ఒక ఐపీఎస్ అధికారిగా నా లక్ష్యం ఒక్కటే ...నేను ఎక్కడ పనిచేసినా అక్కడ ప్రజలు భద్రంగా ఉన్నామన్న భావన కల్పించడం.. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్‌పై నమ్మకం పెంచేలా పనిచేయడం. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్‌కు అంకిత సురాన పనిచేయనున్నారు.
నాకు స్ఫూర్తి వీరే.. : దీక్ష, ఐపీఎస్
నాపేరు దీక్ష.. రాజస్థాన్ లోని జుంజున్ జిల్లా ఖేత్రీ పట్టణం. నాన్న అక్కడే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఏజీఎంగా పనిచేస్తారు. మా అమ్మ గవర్నమెంట్ టీచర్. ఐఐటీ ఢిల్లీ నుంచి నేను బీటెక్ పూర్తి చేశాను. ఆ తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ ్ర΄ారంభించాను. మా నాన్నకు నన్ను ఐపీఎస్‌గా చూడడం ఎంతో ఇష్టం. ఆయన ప్రోత్సాహంతోనే నేను సివిల్స్‌వైపు దృష్టి పెట్టాను. ఆయన ప్రతి విషయంలో నాకు ఎంతో సపో ర్ట్‌గా ఉంటారు. అలాగే మా సీనియర్స్ కూడా సివిల్స్ గురించి గొప్పగా చెప్పడం కూడా ఒక కారణం. సివిల్స్ రెండో ప్రయత్నంలో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు ఎంపికయ్యాను. ఆ తర్వాత మళ్లీ మా నాన్నప్రోత్సాహంతో మూడోసారి సివిల్స్ రాశాను. అలా నాకు మూడో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. ఈ శిక్షణకు వచ్చినప్పుడు చాలా ఆందోళనగా అనిపించింది.
మన శక్తి ఏంటో..
కానీ క్రమంగా అన్నీ నేర్చుకున్నాను..గుర్రపు స్వారీ, గన్ షూటింగ్, క్రై మ్ ఇన్వెస్టిగేషన్ ఇలా ప్రతి పని నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. మహిళలు ఏదైనా సాధించగలరు.. మన శక్తి ఏంటో మనం గుర్తించాలి. అప్పుడు మనం చేసే పనిలో ఆత్మవిశ్వాసంతో చేయగల్గుతాం. అందుకు నేను ఉదాహరణ. నాకు బెస్ట్ ఔట్‌డోర్ ప్రోబేషనర్ అవార్డు వచ్చింది. ఆ విషయం తెలియగానే మొట్టమొదట మా నాన్నకే ఫోన్ చేసి చె΄్పా..ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. నాన్న డ్రీమ్ పూర్తి చేశానన్న తృప్తి నాకు ఎంతో అనిపించింది. సివిల్స్ లేదా ఇంకా ఏ పో టీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికి నేను చెప్పేది ఒక్కటే... మన లక్ష్యం ఏంటి...? ఎలా సాధించాలన్నదానిపై స్పష్టత ఉండాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక పెట్టుకుని చదవాలి. శ్రద్ధగా, నిష్టగా ఉండాలి..అలా అని మిగిలిన విషయాలు వదిలేయద్దు. మనకు నచ్చినట్టు రిలాక్స్ అవ్వాలి. ఎంత ఏకాగ్రతతో చదువుతామన్న దాన్ని బట్టి రోజుకు ఎన్ని గంటలు చదవాలన్నది ఉంటుంది. నేను రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే చదివాను. పరీక్ష దగ్గరపడే కొద్ది కొద్దిగా పెంచుతూ వెళ్లా..రోజుకు 10 గంటలకు పెంచాను. నాకు విజయం వచ్చింది. దీక్ష.. బీహార్ కేడర్‌కు పనిచేయనున్నారు.
➤☛ Inspirational Success Story : నిజంగా.. ఈ కలెక్టర్ స్టోరీ మనకు కన్నీరు పెట్టిస్తోంది..
తొమ్మిది కేజీల బరువుతో 40 కిలోమీటర్లు. .
ఎంపికై ఇక్కడ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాక రోజులో 13 గంటలపాటు శ్రమించేదాన్ని. కఠినమైన శిక్షణ ఉండేది. తొమ్మిది కేజీల బరువుతో 40 కిలోమీటర్ల దూరం అర్ధరాత్రుళ్లు నడవాల్సి ఉంటుంది. ఎందుకీ కష్టం అనిపించేది. సాధారణ మహిళగా ఉండే నన్ను ఓ శక్తిమంతమైన పోలీసు ఆఫీసర్‌గా తీర్చిదిద్దింది ఈ శిక్షణే కదా అని గుర్తుకొచ్చిన మరుక్షణం.. నైరాశ్యాన్ని పక్కనపెట్టి అందరికన్నా ముందుండేదాన్ని. ఈ శిక్షణలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకున్నా. ఇండోర్, అవుట్‌డోర్ శిక్షణలో ప్రథమ స్థానంతోపాటు స్వార్డ్ ఆఫ్ ఆనర్ గౌరవాన్ని అందుకున్నా. ది బెస్ట్ అవుట్‌డోర్ ప్రొబెషనర్‌గా, ప్లటూన్ కమాండర్‌గా నిలిచాక నేను పడిన కష్టమంతా మరచిపోయా.
☛➤ IAS Success Story : కూలీనాలీ చేస్తూ చదివాడు.. ఐఏఎస్ సాధించాడు.. కానీ ఈయన పెళ్లి మాత్రం..
చరిత్రలో..
వల్లబాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో చరిత్రలో ఈ స్థానాన్ని దక్కించుకున్న రెండో మహిళగా నిలవడం గర్వంగా ఉంది. క్షేత్ర పర్యటనలో భాగంగా ఒకసారి జైలుకెళ్లాం. అనుకోని తప్పిదాలతో శిక్ష అనుభవిస్తూ.. ఆ తర్వాత పశ్చాత్తాపంతో కుంగిపోతున్న వారినెందరినో చూశా. వారి కథలను మరవలేను. అనుకున్నది సాధించగలిగే సత్తా మనందరిలోనూ ఉంటుంది. మనల్ని మనం నమ్మితే చాలు.
ఆరేళ్ల బాబును వదిలి.. ఐపీఎస్ ట్రైనింగ్‌కు వచ్చా.. : నిత్యా రాధాకృష్ణన్, ఐపీఎస్
ఐపీఎస్ కావాలన్న లక్ష్యం కోసం ఆరేళ్ల బాబును వదిలి ట్రైనింగ్‌కు వచ్చాను..చివరకు మా బ్యాచ్‌లో లేడీప్రోబేషనరీ ఔట్‌డోర్ టాపర్‌గా నేను నిలవడం సంతోషంగా ఉంది. నాది తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా. మా నాన్నగారు రైతు, మా అమ్మ టీచర్. నాకు ఒక చెల్లి. వీఐటీ యూనివర్సిటీ వెల్లూరులో నేను బీటెక్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాను. తర్వాత వివాహం అయ్యింది. సాఫ్ట్‌వేర్‌లో మంచి ఉద్యోగం అయినా ఏదో వెలితి ఉండేది. దాన్ని వదిలేశాను. ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్‌లో పనిచేశాను.అదీ మంచి ఉద్యోగమే అయినా తృప్తి లేదు. ప్రజలతో మమేకమై వారికి ఉపయోగపడే వృత్తిలో ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే నాకు కొడుకు పుట్టాడు.
☛ UPSC Civils Ranker Success Story : విధికే సవాలు విసిరా.. 22 ఏళ్లకే సివిల్స్ కొట్టానిలా..
బాబు పుట్టిన తర్వాత నేను..
ఈ టైంలో మంచి ఉద్యోగం వదిలి సివిల్స్ ఎందుకు అని మా కుటుంబం, ముఖ్యంగా నా భర్త నిరుత్సాహపర్చలేదు.. నీ లక్ష్యం కోసం వెళ్లు.. కుటుంబాన్ని నేను చూసుకుంటా అన్నాడు. దాంతో బాబు పుట్టిన తర్వాత నేను యూపీఎస్సీకి ప్రిపరేషన్ ప్రారంభించాను. అలా ఐపీఎస్‌కి సెలెక్ట్ అయ్యాను. నేను ఔట్‌డోర్ ట్రైనింగ్‌లో ట్రోఫీ పొందానంటే ఈ ట్రైనింగ్ నాలో పెంచిన ఆత్మవిశ్వాసమే కారణం. ఐపీఎస్ శిక్షణ అనేది అంత చిన్న విషయమేమీ కాదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా ఎంతో శ్రమించాలి. శిక్షణప్రారంభంలో చాలా కష్టంగా అనిపించినా..క్రమంగా మనలోని శక్తిని మనం గుర్తిస్తాం.
మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్‌ను. ఎంతోమంది మహిళా పోలీసు అధికారులు నేను చూసిన వాళ్లు.. వాళ్లంతా నాకు ప్రేరణే. ఒక మహిళాపోలీస్ అధికారిగా నా వృత్తి జీవితంలో మహిళలు, చిన్నారుల సంరక్షణకు ఎక్కువప్రా ధాన్యం ఇవ్వాలని నేను భావిస్తున్నాను. నా శిక్షణలో నా కుటుంబం పోర్ట్ ఎంతో ఉంది.
ఇష్టపడి వచ్చినందుకేమో..
క్రీడల్లోనూ ప్రవేశం ఉంది. అందుకే యోగా, ఫైరింగ్, గుర్రపుస్వారీ, ఈత అన్నింటినీ ఆస్వాదించా. ఇష్టపడి వచ్చినందుకేమో కష్టమనిపించలేదు. శిక్షణలో భాగంగా అర్ధరాత్రి 9 కేజీల బరువుతో ఎనిమిది గంటలపాటు 40 కి.మీ. రూట్ మార్చ్, రెండు గంటల్లో 21 కి.మీ. మారథాన్ వంటివి ఎప్పటికీ మరిచిపోను.
మా అబ్బాయి అలా అడిగినప్పుడు..
‘అమ్మా.. నాన్న కదా పోలీసు అవ్వాలి. నువ్వు అయ్యావేంటి? అని మా అబ్బాయి అడిగినప్పుడు ఆశ్చర్యమేసింది. లింగభేదం లేదనే విషయాన్ని ముందుగా వాడికి నేర్పడం మొదలుపెట్టా. నేటి తరం అమ్మాయిలకూ ఇదే చెబుతున్నా... మనసుకిష్టమైంది చేయండి. పట్టుదల ముందు ఏదైనా తల వంచి తీరాల్సిందే.