సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్‌టర్నల్) పోస్టుల నియామకానికి సెప్టెంబర్ 4న రాతపరీక్ష నిర్వహించగా, మెరిట్ ప్రొవిజినల్ జాబితాను సెప్టెంబర్ 16న రాత్రి విడుదల చేసినట్లు జీఎం పర్సనల్ (రిక్రూట్‌మెంట్ సెల్) కట్టా బసవయ్య తెలిపారు.
సింగరేణి రాతపరీక్ష ప్రొవిజినల్ జాబితా విడుదల
పరీక్షకు సంబంధించిన కీని సెప్టెంబర్ 5వ తేదీన, ఫలితాలను 8వ తేదీన విడుదల చేయడం తెలిసిందే. ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ ప్రొవిజినల్ జాబితాను సింగరేణి లింక్ https://scclmines.com/scclnew/careers_Results.asp లో పొందుపరిచినట్లు జీఎం తెలిపారు.