Skip to main content

Singareni Junior Assistant: పరీక్ష 'Key' విడుదల

Singareniలోని 177 Junior Assistant పోస్టుల కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సెప్టెంబర్‌ 4న నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డైరెక్టర్‌(పర్సనల్‌) ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు.
SCCL
సింగరేణి ఉద్యోగ పరీక్ష 'Key' విడుదల

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినవారిలో 79 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 98,882 మంది అభ్యర్థుల హాల్‌టికెట్లను Singareni వెబ్‌సైట్‌లో ఉంచగా 90,928 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 77,907 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 187 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే.. మంచిర్యాల జిల్లాలో 7,875 (88.62 శాతం), భద్రాద్రి కొత్తగూడెం 12,079(87.31 శాతం), వరంగల్‌ 9,221(84.6 శాతం), కరీంనగర్‌ 16,286(82.09 శాతం), ఖమ్మం 9,915 (81.35 శాతం), హైదరాబాద్‌ 12,672(72.63 శాతం) మంది హాజరుకాగా, తక్కువగా ఆదిలాబాద్‌ జిల్లాలో 2,718(64.42 శాతం) మంది హాజరయ్యారు. డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ కరీంనగర్‌ జిల్లాలోని పలు పరీక్షాకేంద్రాల్లోని ఏర్పాట్లను పర్యవేక్షించారు. హైదరాబాద్‌లో జనరల్‌ మేనేజర్‌(కో ఆర్డినేషన్‌) కె.సూర్యనారాయణ పరీక్షా కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, కొన్నికేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. 

Singareni Junior Assistant Exam Key Click Here - BOOKLET A | BOOKLET B | BOOKLET C | BOOKLET D

7న అభ్యంతరాలు సమర్పించాలి: డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ 

సెప్టెంబర్‌ 4న జరిగిన సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష ఏ, బీ, సీ, డీ ప్రశ్నపత్రాలకు సంబంధించిన ‘కీ’ని సెప్టెంబర్‌ 5వ తేదీ ఉదయం 11 గంటలకు సింగరేణి వెబ్‌సైట్‌ https://scclmines.com/scclnew/index.aspలో ఉంచనున్నట్లు డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 7న ఉదయం 11 గంటల లోపు సింగరేణి వెబ్‌ సైట్‌ ద్వారానే అభ్యంతరాలు సమర్పించాలని కోరారు. 

చదవండి: 

Published date : 05 Sep 2022 01:22PM

Photo Stories