Fee Reimbursement: ప్రతిభావంతులైన పిల్లలకు అండ: కె.సూర్యనారాయణ
Sakshi Education
సింగరేణి ఉద్యోగుల ప్రతిభావంతులైన పిల్లలకు యాజమాన్యం అండగా నిలుస్తోందని సంస్థ జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ తెలిపారు.
ప్రతిభావంతులైన పిల్లలకు అండ: కె.సూర్యనారాయణ
సింగరేణి భవన్ లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎ.శ్రీలక్ష్మి కుమారుడు చెన్నై ఐఐటీలో మూడో సెమిస్టర్ చదువుతున్నాడు. వారికి యాజమాన్యం తరఫున మూడో విడత రూ.లక్ష చెక్కును సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో సూర్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు సింగరేణివ్యాప్తంగా ఐఐటీ, ఐఐఎంలలో చదువుతున్న 29 మంది పిల్లలకు సంస్థ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తోందని ఆయన తెలిపారు.