Singareni Jobs: ‘జూనియర్ ఇన్‌స్పెక్టర్’ నియామకమెప్పుడో? రెండు నెలలు దాటినా..

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఐదు జూనియర్ ఇన్‌స్పెక్టర్ (ఇంటర్నల్) టీ అండ్ ఎస్ గ్రేడ్ –డీ పోస్టుల భర్తీకి యాజమాన్యం ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు ఏడు నెలల తర్వాత జూలై 7వ తేదీన పరీక్షలు నిర్వహించింది. పోస్టులకు 27 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 26 మంది హాజరయ్యారు.
Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
ఈ ఫలితాలు పరీక్ష జరిగిన గంటలోపే లేదంటే అదేరోజు సాయంత్రం వరకు వెల్లడించే అవకాశం ఉంది. కానీ రెండు రోజుల తర్వాత ప్రకటించారు. ఇందులోనే జాప్యం అనుకుంటే పరీక్ష జరిగి రెండు నెలలు దాటినా ఎంపిక చేసిన వారి పేర్లను రిక్రూట్‌మెంట్ సెల్ ఇంతవరకూ ప్రకటించకపోవడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఫలితాల వెల్లడిలో జాప్యం చేయడం వెనుక ఏదో కారణం ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల విషయంలో ఎవరైనా అభ్యర్థులు కోర్టుకు వెళ్లారా అంటే అదీ లేదు. కాగా, ఈ విషయమై కొంతమంది అభ్యర్థులు సింగరేణి సీఎండీని కలవగా త్వరలో ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారని, అది కూడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Mela: గుడ్‌న్యూస్.. రేపు మెగా జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే
ఇప్పటికై నా సింగరేణి రిక్రూట్‌మెంట్ సెల్ అధికారులు స్పందించి వీలైనంత త్వరగా జాబితా ప్రకటించి, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు.