Skip to main content

JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఆన్సర్ కీ విడుదల..

JEE Advanced Answer Key

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 పరీక్ష ప్రొవిజనల్‌ ఆన్సర్‌ కీ విడుదల అయ్యింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు jeeadv.ac.in నుంచి ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు, మొభైల్‌ నెంబర్‌ వివరాలు ఎంటర్‌ చేసి ప్రశ్నపత్రంతో పాటు ప్రొవిజనల్‌ కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలుంటే సోమవారం సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాల్సి ఉంటుంది.

TS POLYCET Results Released: పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తుది ఫలితాలు జూన్‌ 9న విడుదల చేయనున్నారు. కాగా JEE అడ్వాన్స్‌డ్-2024 పరీక్షను మే 26న రెండు సెషన్లలో నిర్వహించారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది.

కాగా  జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్‌ఐటీలలో అడ్మిషన్లు కల్పిస్తారన్న విషయం తెలిసిందే. 

TS 10th Class Supplementary Exams: నేటి నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Published date : 03 Jun 2024 03:15PM

Photo Stories