కరీంనగర్‌సిటీ: ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తెలుగు, ఇంగ్లిష్, కామర్స్, జూవాలజీ, ఎకనామిక్స్, బాటనీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, మైక్రోబయాలజీ, మ్యాథ్స్‌లలో ఖాళీలు ఉన్నాయన్నారు. పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండి, నెట్, సెట్, పీహెచ్‌డీ, టీచింగ్‌లో అనుభవం ఉన్న వారికి వెయిటేజీ ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 11న నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు.