Skip to main content

Harish Rao: శ్రమించారు.. ఉద్యోగాలు సాధించారు

సిద్దిపేటకమాన్‌: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Harish Rao, advantage of free training and studied hard to secure jobs.
శ్రమించారు.. ఉద్యోగాలు సాధించారు

 సిద్దిపేటలో మంత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ పొందిన వారిలో 80 మంది పోలీసులుగా ఉద్యోగాలు సాధించారు. అక్టోబ‌ర్ 6న‌ రాత్రి వీరిని మంత్రి సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పోలీసు శాఖలో 40,821, వైద్యారోగ్యశాఖలో 41వేలు, పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలు పదివేలు భర్తీ చేశారని తెలిపారు. కష్టపడి చదివితే తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారని అన్నారు.

చదవండి: Constable to Doctor: డాక్ట‌ర్ కానున్న అన్నాద‌మ్ములు

కడుపున పుట్టిన పిల్లలు ప్రయోజకులు అయితే కలిగే ఆనందం వెలకట్టలేనిది అన్నారు. ఉద్యోగాలు సాధించిన వారు క్రమశిక్షణతో, నీతి నిజాయితీతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు, మీకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని అన్నారు. అంతకుముందు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో మంత్రి ఆప్యాయంగా పలకరించి, మాట్లాడారు.

కార్యక్రమంలో సుడా చైర్మన్‌ మారెడ్డి రవిందర్‌రెడ్డి, సీపీ శ్వేత, అదనపు డీసీపీలు శ్రీనివాసరావు, మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, వన్‌ టౌన్‌ సీఐ కృష్ణారెడ్డి, టూటౌన్‌ సీఐ రవికుమార్‌, త్రీ టౌన్‌ సీఐ భానుప్రకాష్‌, రూరల్‌ సీఐ చేరాలు తదతరులు పాల్గొన్నారు.

Published date : 07 Oct 2023 03:22PM

Photo Stories