TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించడంతో ఆర్టీసీ కార్మికుల సంబురాలు అంబరాన్నింటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ప్రభుత్వ, అద్దె బస్సులు 875 ఉన్నాయి. 1,472 కండక్టర్లు, 1,232 మంది డ్రైవర్లతో పాటు సెక్యూరిటీ, ఆఫీస్ స్టాఫ్, మెకానిక్‌లు, ఇంజినీరింగ్ సెక్షన్, వర్క్‌షాప్‌లో పనిచేసే 822 మొత్తం 3,526 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
చదవండి: Good News: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకు లైన్‌క్లియర్?
న్యాయమైన డిమాండ్ల సాధనకు 2019లో ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేయగా, సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఆర్టీసీని భవిష్యత్‌లో ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈమేరకు జూలై 31న బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ నిలువెత్తు కటౌట్లను ప్రదర్శిస్తూ తెలంగాణ చౌక్‌లో టపాసులు పేల్చి, స్వీట్ల పంపిణీ అనంతరం క్షీరాభిషేకం చేశారు.
చదవండి: ITI Jobs: ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్... ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది ఇదే..