New KV School: కేంద్రీయ విద్యాలయానికి వచ్చే నెల భూమి పూజ
స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్లో సెప్టెంబర్ 25న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్త జిల్లా అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం రావడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు అవసరమైన భవనాలను జీ 2 తరహాలో నిర్మించేందుకు రూ.28 కోట్ల 73 లక్షల 96 వేల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
కేంద్రీయ విద్యాలయం స్కూల్ భవనానికి రూ.10 కోట్ల 90 లక్షలు, ఉపాధ్యాయుల భవనాలకు రూ.3 కోట్ల 29 లక్షలు, క్యాంటీన్‌కు రూ.5 లక్షల 72 వేలు, గార్డు రూమ్‌కు రూ.లక్ష 4 వేలు, విద్యాలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి రూ.కోటీ 95 లక్షలు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.5 కోట్ల 79 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
చదవండి: Photography Free Training: ఫొటో, వీడియోగ్రఫీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
విద్యార్థులకు వివిధ క్రీడల్లో నైపుణ్యం పెంచేందుకు అవసరమైన ఆట స్థలాలను రూ.4 కోట్ల 77 లక్షలతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన 10 మాసాల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
రానున్న విద్యా సంవత్సరం నుంచే తరగతులు నిర్వహించేందుకు వీలుగా ఈ విజయదశమి నుంచి పట్టణంలోని జీవీఎంసీ ఉడ్‌పేట పాఠశాల ఆవరణలో కేంద్రీయ విద్యాలయ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. ఒక్కో తరగతి గదికి 40 మంది విద్యార్థులతో తొలుత 1 నుంచి 5వ తరగతుల వరకు ప్రవేశాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తర్వాత దశల వారీగా తరగతులను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.
చదవండి: New Education System: నూతన విద్యా విధానంతో మంచి ఫలితాలు