New Education System: నూతన విద్యా విధానంతో మంచి ఫలితాలు
ఎచ్చెర్ల క్యాంపస్: నూతన విద్యా విధా నం అమలుతో భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌ల ర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు అన్నా రు. వర్సిటీ పరిపాలన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. దే శంలో నూతన విద్యా విధానం– 2020 అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందని చెప్పారు.
విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 4, 5 తేదీల్లో నూతన విద్యావిధానం వల్ల విద్యా విధానంలో మార్పులు, ప్రయోజనాలపై విద్యా విభాగం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నూతన విద్యా విధానం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందని, నైపుణ్య విద్యకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పా రు. నాలుగేళ్ల సమీకృత డిగ్రీలు, ఆనర్స్ డిగ్రీ, స్పెషలైజేషన్ సబ్జెక్టు డిగ్రీలు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రస్తుత అవసరాలను అనుగుణంగా సిలబస్‌లో మార్పులు వంటివి చోటు చేసుకుంటున్నాయని అన్నారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి నైపుణ్య విద్య అందుతుందని చెప్పారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత అన్ని విద్యలు బలోపేతం అవుతాయని తెలిపారు. 2025 ఏడాది నాటికి విద్యలో సమూల మార్పు లు వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పన, బోధన సిబ్బంది నియామకం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.