Skip to main content

Coal India Jobs: ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారికి గుడ్‌న్యూస్‌.. రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం

భారత ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్(CIL)ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 640 ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Coal India Jobs Coal India Limited Recruitment 2024  Coal India Limited recruitment 2024  CIL trainee posts job notification  Apply for Coal India Limited jobs
Coal India Jobs

మొత్తం ఖాళీలు: 640
ఖాళీల విభాగాలు

  • మైనింగ్ ఇంజినీరింగ్: 263
  • సివిల్ ఇంజనీరింగ్: 91
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 102
  • మెకానికల్ ఇంజినీరింగ్: 104
  • సిస్టమ్ ఇంజనీరింగ్: 41
  • ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్: 39

విద్యార్హత: BE/ BTech పూర్తి చేసిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.దీంతో పాటు గేట్ 2025 స్కోర్‌ కలిగి ఉండాలి. 
వయస్సు: 30/09/2024 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు.

Mega Job Mela: మెగా ఫారిన్‌ జాబ్‌ మేళా..వివిధ దేశాల్లో భారీ జీతాలతో..


ఎంపిక విధానం: గేట్ స్కోర్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది

Job Mela: రేపు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా

వేతనం: ఎంపికైనవారికి ఏడాది శిక్షణ సమయంలో రూ. 50,000-1,60,000, ఆ తర్వాత 60,000-1,80,000 జీతం ఉంటుంది.
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేది: నవంబర్‌ 28, 2024

Published date : 30 Oct 2024 09:46AM

Photo Stories