Skip to main content

Job Mela: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలు

కొవ్వూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ జె.సునీత తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిగ్రీ కళాశాల సంయుక్తాధ్వర్యంలో ఈ జాబ్‌ మేళా జరుగుతుందని చెప్పారు.
Job Mela  Kovvuru government degree college job fair announcement  AP State Skill Development Organization job fair in Kovvuru  Joint job fair by AP Skill Development and Degree College
Job Mela Job mela for freshers

వరుణ్‌ మోటార్స్‌, అపోలో పార్మసీ, ఇన్నోవాస్యూర్‌ జస్ట్‌ డయల్‌ లిమిటెడ్‌, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థులు అర్హులన్నారు.

ఆసక్తి కలిగిన వారు ఈ జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా అధికారి జి.సుధాకర్‌ పర్యవేక్షణలో ఈ జాబ్‌మేళా జరుగుతుందని తెలిపారు.

Tomorrow Job Mela: నిరుద్యోగులకు శుభవార్త రేపు జాబ్‌ మేళా

జాబ్‌మేళా ముఖ్యసమాచారం


ఎప్పుడు: నేడు(మంగళవారం)
ఎక్కడ: కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల
విద్యార్హత: డిప్లొమా/ఐటీఐ/డిగ్రీ/ఫార్మసీ

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 22 Oct 2024 11:31AM

Photo Stories