Skip to main content

Scholarships: ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్స్‌.. 50 శాతం అమ్మాయిలకే..

Oil and Natural Gas Corporation

దేశంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ సంస్థ.. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)ఫౌండేషన్‌.. ప్రతిఏటా సీఎస్‌ఆర్‌ కింద స్కాలర్‌షిప్స్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది.

స్కాలర్‌షిప్స్‌: ఈ ప్రోగ్రామ్‌ కింద అర్హులైన 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఏడాదికి రూ.48వేలను స్కాలర్‌షిప్‌గా చెల్లిస్తారు. అంటే నెలకు రూ.4వేలను స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 50శాతం స్కాలర్‌షిప్‌లను అమ్మాయిలకు కేటాయిస్తారు.

అర్హతలు:

  • ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ లేదా మాస్టర్స్‌ ఇన్‌ జియోఫిజిక్స్‌/ జియాలజీ ప్రోగ్రామ్‌లలో మొదటి ఏడాది చదివే వారు దరఖాస్తుకు అర్హులు. అలాగే గత అకడమిక్‌ పరీక్షల్లో కనీసం 60శాతం సీజీపీఏ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.  
  • జనరల్‌/ఓబీసీ కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.4.5లక్షలకు మించరాదు.
  •  ప్రతి ఏటా జూలైలో ఈ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ వెలువడుతుంది. 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.ongcindia.com

చ‌ద‌వండి: ఈ ప‌థ‌కానికి ఎంపికైతే... ఏడాదికి రూ.12000 అంద‌జేత

Photo Stories