Fellowships: రామలింగస్వామి రీ–ఎంట్రీ ఫెలోషిప్ 2021–22
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన బయోటెక్నాలజీ విభాగం.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫెలోషిప్ ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఫెలోషిప్ వ్యవధి: ఐదేళ్లు
అర్హత: లైఫ్ సైన్సెస్/అగ్రికల్చర్, బయోఇన్ఫర్మేటిక్స్/తత్సమాన సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/ఎండీ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఓవర్‌సీస్(విదేశీ) రీసెర్చ్ ల్యాబొరేటరీల్లో కనీసం మూడేళ్ల పోస్ట్ డాక్టోరల్ పరిశోధన అనుభవం ఉండాలి.
లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ, బయో–ఇంజనీరింగ్, హెల్త్ కేర్(హ్యూమన్, యానిమల్), అగ్రికల్చర్, వెటర్నరీ బయోటెక్నాలజీ, బయో–ఎనర్జీ సంబంధిత విభాగాల్లో పనిచేస్తున్న సైంటిస్ట్‌లు దీనికి అర్హులు.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఫెలోషిప్ మొత్తం: నెలకు రూ.1,00,000 చెల్లిస్తారు. అదనంగా హెచ్‌ఆర్‌ఏ కింద నెలకి రూ.18,500 చొప్పున చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీబీటీ–హెచ్‌ఆర్‌డీ ప్రాజెక్ట్–మేనేజ్‌మెంట్ యూనిట్, రీజనల్ సెంటర్ ఫర్ బయెటెక్నాలజీ,ఎన్‌సీఆర్ బయోటెక్ సైన్స్ క్లస్టర్, థర్డ్ మైల్‌స్టోన్, ఫరీదాబాద్–121001,
హర్యానా చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.01.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 10.02.2022
వెబ్‌సైట్: https://dbtindia.gov.in