Skip to main content

Research fellowship: బైరాక్‌ ఫెలోషిప్‌కు ప్రకటన విడుదల

BIRAC Innovation Fellowships

భారత బయోటెక్నాలజీ రంగాన్ని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేసే ప్రభుత్వరంగ సంస్థ.. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌(బైరాక్‌). వ్యూహాత్మక పరిశోధనలు, నూతన ఆవిష్కరణల కోసం నిత్యం పనిచేస్తుంటుంది. పరిశోధన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సంస్థ.. ఈ–యువ, ఇన్నోవేషన్‌ ఫెలోషిప్స్‌ను అందిస్తుంది. ప్రస్తుతం 2022 సంవత్సరానికి బైరాక్‌ ఫెలోషిప్స్‌కు నోటిఫికేషన్‌ వెలువడింది. పరిశోధన రంగంపై ఆసక్తి ఉన్న యూజీ, పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులు మార్చి 31వ తేదీలోగా ఈ ఫెలోషిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read: Fellowships: రామలింగస్వామి రీ–ఎంట్రీ ఫెలోషిప్‌ 2021–22

ఫెలోషిప్‌ వివరాలు

  •      ఈ–యువ(అండర్‌ గ్రాడ్యుయేట్‌): 250
  •      అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  •      స్టయిపండ్‌: ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలలకు(క్వార్టర్లీ) రూ.7500  స్టయిపండ్‌గా అందిస్తారు. వీటితోపాటు రీసెర్చ్‌గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.2 లక్షల 50 వేలు  చెల్లిస్తారు.

బైరాక్‌ ఇన్నోవేషన్‌ ఫెలోస్‌ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్, పీహెచ్‌డీ): 30

  •      అందించే విభాగాలు: హెల్త్‌కేర్, లైఫ్‌ సైన్సెస్, డయాగ్నస్టిక్స్, మెడికల్‌ డివైజెస్, డ్రగ్స్, డ్రగ్‌ ఫార్ములేషన్స్‌ తదితరాలు.
  •      అర్హతలు: ఏదైనా విభాగంలో మాస్టర్స్‌/పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
  •      స్టయిపండ్‌: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఫెలోస్‌కి నెలకు రూ.30 వేలు, పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోస్‌కి నెలకు రూ.50 వేలు స్టయిపండ్‌గా అందిస్తారు. వీటితోపాటు అదనంగా రీసెర్చ్‌ గ్రాంట్‌ కింద ఏడాదికి పీజీ ఫెలోస్‌కి రూ.2 లక్షలు, పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోస్‌కి ఏడాది రూ.5 లక్షలు  చెల్లిస్తారు.

Also read: ICAR Fellowships: విదేశాలకు వెళితే... నెలకు రూ. ల‌క్షా యాభై వేలు

ముఖ్యమైన సమాచారం

  •      దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  •      దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2022
  •      వెబ్‌సైట్‌:https://birac.nic.in
     
Last Date

Photo Stories