ICAR Fellowships: విదేశాలకు వెళితే... నెలకు రూ. లక్షా యాభై వేలు
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్)కు చెందిన అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ విభాగం.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఇండియన్, ఫారిన్ అభ్యర్థుల నుంచి ఫెలోషిప్‌లకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: 30
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో అగ్రికల్చర్/అనుబంధ సైన్సుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 35ఏళ్లు మించకుండా ఉండాలి.
ఫెలోషిప్ మొత్తం: భారతదేశానికి చెందిన విద్యార్థులు విదేశాలకు వెళితే నెలకు 2000 యూఎస్ డాలర్లు(దాదాపు రూ. లక్షా యాభై వేలకు పైగా), ఏడాదికి 1000 డాలర్లు చొప్పున కంటింజెంట్, ఇతర ఖర్చుల కింద చెల్లిస్తారు. విదేశాలకు చెందిన అభ్యర్థులు భారత్‌కు వస్తే నెలకు రూ.40,000, కంటింజెంట్, ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.25,000 చొప్పున చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్స్, సాధించిన విజయాలు, పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్ సైంటిస్ట్(ఈక్యూర్), అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ డివిజన్, ఐకార్, క్రిషి అనుసంధాన్ భవన్ 2, పూసా, న్యూఢిల్లీ–110012 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: nsicarif@gmail.com
దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021
వెబ్‌సైట్: https://education.icar.gov.in