Skip to main content

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు

2021 విద్యాసంవత్సరానికి సంబంధించి ముంబైలోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (ఎన్‌ఐటీఐఈ).. పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు - అర్హతలు:
  • పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (పీజీడీఐఈ) 51వ బ్యాచ్:
    అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
  • పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్(పీజీడీఐఎం) 28వ బ్యాచ్:
    అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణుల వ్వాలి. బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వాలిడ్ క్యాట్ స్కోర్ ఉండాలి.
  • పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సస్టయినబిలిటీ మేనేజ్‌మెంట్(పీజీడీఎస్‌ఎం) 21వ బ్యాచ్:
    అర్హత:
    కనీసం 60శాతం మార్కులతో ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వాలిడ్ క్యాట్/గేట్/జీఆర్‌ఈ/ జీమ్యాట్ స్కోర్ ఉండాలి.
  • ఫెలో (డాక్టోరల్) ప్రోగ్రామ్-2021:
    అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: క్యాట్/గేట్/జీఆర్‌ఈ/జీమ్యాట్ వాలిడ్ స్కోర్ వెయిటేజ్, ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 1, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.nitie.ac.in/admission-2021

Photo Stories