EFLU Hyderabad Admissions: టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే...
హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్శిటీ(ఇఫ్లూ).. 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య పద్ధతిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్(పీజీసీటీఈ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఎంఏ(ఇంగ్లిష్/సంబంధిత సబ్జెక్టులైన(లింగ్విస్టిక్స్, ఎడ్యుకేషన్, మాస్ కమ్యూనికేషన్, సైకాలజీ, క్రిటికల్ హ్యూమానిటీస్/లిబరల్ ఆర్ట్స్)
వయసు: వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: దీనికి అడ్మిషన్ టెస్ట్ ఉండదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్శిటీ(ఇఫ్లూ), హైదరాబాద్–500007 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.05.2022
వెబ్‌సైట్: https://www.efluniversity.ac.in/
చదవండి: Admission in BITS Pilani: బిట్స్, పిలానీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..