Skip to main content

ఐఐఎం–క్యాట్‌ 2021.. దరఖాస్తు వివరాలు ఇలా..

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంలు)ల్లో ప్రవేశాలకు వీలు కల్పించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌–2021కు నోటిఫికేషన్‌ విడుదలైంది. క్యాట్‌ స్కోర్‌తోపాటు మలిదశ ఎంపిక ప్రక్రియ ఆధారంగా ఐఐఎంల్లో పీజీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సుల్లో అడ్మిషన్‌ లభిస్తుంది.
పరీక్ష: కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌)–2021.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు రావాలి. డిగ్రీ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: క్యాట్‌ స్కోర్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), మలిదశలో రిటన్‌ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.08.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

క్యాట్‌ పరీక్ష తేది: నవంబర్‌ 28, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://iimcat.ac.in

Photo Stories