Skip to main content

ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌లో బీబీఏ, ఎంబీఏ.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌(ఐసీఐ).. 2021 విద్యాసంవత్సరానికి ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీతో కలిసి తిరుపతి, నోయిడా క్యాంపస్‌ల్లో బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ): కోర్సు వ్యవధి–మూడేళ్లు(ఆరు సెమిస్టర్లు.
అందిస్తున్న క్యాంపస్‌లు–సీట్లు: తిరుపతి–120 సీట్లు, నోయిడా–120 సీట్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 22ఏళ్లు మించకూడదు.

కోర్సు: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ): కోర్సు వ్యవధి –రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు)
అందిస్తున్న క్యాంపస్‌లు–సీట్లు: తిరుపతి–30సీట్లు, నోయిడా–30సీట్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఆర్ట్స్‌ /హాస్పిటాలిటీ /హోటల్‌మేనేజ్‌మెంట్‌లో ఫుల్‌టైమ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
వయసు: 01.07.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ, పరీక్ష తేది వెల్లడించాల్సి ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌/ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

వెబ్‌సైట్‌: http://thims.gov.in

Photo Stories