Admissions in PG courses: ఢిల్లీ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్–2022
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన ఢిల్లీ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్(డీయూఈటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సులు: ఎంఏ, ఎంకాం, బీఈడీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ తదితరాలు.
సబ్జెక్టులు: అరబిక్, బుద్ధిస్ట్ స్టడీస్, లింగ్విస్టిక్స్, సైకాలజీ, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ప్లాంట్ మాలిక్యులార్, బయాలజీ, ఆంత్రోపాలజీ, హోమ్ సైన్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: కోర్సులను అనుసరించి మెరిట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.05.2022
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
వెబ్‌సైట్: https://www.admission.uod.ac.in/
చదవండి: TS EDCET 2022 : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..