Admissions in NISM: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నుండి ప్రత్యేక కోర్సులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్(ఎన్‌ఐఎస్‌ఎం).. పలు అకడమిక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనిలో భాగంగా పీజీడీఎం(ఎస్‌ఎం), ఎల్‌ఎల్‌ఎం, పీజీపీ, పీజీసీఎం (డీఎస్‌ఎఫ్‌ఎం), సీపీడబ్లు్యఎంల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(పీజీపీ)
- ఈ కోర్సును వీకెండ్ పద్ధతిలో అందిస్తారు. దీని కాలవ్యవధి 15 నెలలు. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ, రీసెర్చ్ అనాలిసిస్ అనే మూడు స్పెషలైజేషన్లు ఉన్నాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు అనువుగా ఉండే ఈ ప్రోగ్రామ్ నాలుగు ట్రైమిస్టర్‌లుగా ఉంటాయి. చివరి ట్రైమిస్టర్‌లో స్పెషలైజేషన్‌కు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి మూడు ట్రైమిస్టర్‌లు అందరికీ ఉమ్మడిగానే నిర్వహిస్తారు. ఫౌండేషన్ కోర్సులకు 9 నెలలు, స్పెషలైజేషన్ కోర్సులకు 3 నెలలు, స్పెషలైజేషన్ సంబం«ధించిన డిజర్టేషన్‌కు మరో 3 నెలల వ్యవధితో దీన్ని రూపొందించారు. ప్రోగ్రామ్ మొత్తానికి 45 క్రెడిట్స్ ఉంటాయి.
- ప్రోగ్రామ్‌నుకు సంబంధించి సెషన్స్‌ను వారాంతాల్లో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో తమకు నచ్చిన సెషన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. శని, ఆదివారాల్లో సెషన్స్ ఉంటాయి.
- అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు.
- ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్ట్‌గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ మేనేజ్‌మెంట్ (డేటా సైన్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్)
- ఈ ప్రోగ్రామ్ మొత్తం 14 నెలల వ్యవధితో వీకెండ్ పద్దతిలో అందిస్తారు. ఇందులో 5 ట్రైమిస్టర్లుంటాయి. ఫైనాన్షియల్ మార్కెట్‌లలో డేటా ప్రాసెసింగ్ విధానాలు, టూల్స్ వినియోగం తదితర అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 16 కోర్సులు, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ మొత్తానికి 45 క్రెడిట్స్ నిర్ధేశించారు.
- అర్హత: కనీసం 50శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంపిక: అకడమిక్ ప్రొఫైల్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎల్‌ఎల్‌ఎం(ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌సెక్యూరిటీస్ లాస్)
- ఇది ఏడాది కాలవ్యవధితో నిర్వహించే అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్. దీనిలో మొత్తం మూడు ట్రైమిస్టర్‌లుంటాయి. మొదటి ట్రైమిస్టర్‌లో రీసెర్చ్ మెథడ్స్, లా అండ్ జస్టిస్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్, పబ్లిక్ లా అండ్ గవర్నెన్స్, సెక్యూరిటీ మార్కెట్స్ అనే నాలుగు జనరల్ పేపర్లు, రెండో ట్రైమిస్టర్‌లో కంపెనీ లా, సెక్యూరిటీ రెగ్యులేషన్స్, కాంపిటీషన్ లా అండ్ పాలసీ అనే మూడు స్పెషల్ పేపర్లుంటాయి. మూడో ట్రైమిస్టర్‌లో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ లాస్, ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ జాయింట్ వెంచర్, లా ఆఫ్ ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంకర్పటసీ అనే మూడు పేపర్లు ఉంటాయి. డిజర్టేషన్, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
- అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంపిక: ఆన్‌లైన్‌టెస్ట్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ కమొడిటీ వేర్ హౌసింగ్ మేనేజ్‌మెంట్
- ఈ ప్రోగ్రామ్ కాలవ్యవధి 6 నెలలు ఉంటుంది. మొదటి మూడు నెలలు రెసిyð న్షియల్ టీచింగ్, చివరి మూడు నెలలు వేర్ హౌసింగ్ ఇండస్ట్రీ ఫీల్డ్ ట్రిప్, డిజర్టేషన్ ప్రాజెక్టులు ఉంటాయి. మొత్తం ప్రోగ్రామ్‌లో 5 పేపర్లు ఉంటాయి.
- అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్‌హౌసింగ్ ఇండస్ట్రీలో కనీసం ఏడాది పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- ఎంపిక: పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీస్ మార్కెట్స్)
- రెండేళ్ల కాలవ్యవధితో ఉండే ఈ కోర్సును ఫుల్‌టైం విధానంలో అందిస్తున్నారు. ఏడాదికి మూడు ట్రైమిస్టర్స్ ఉంటాయి. ఒక్కో ట్రైమిస్టర్‌కు 18 చొప్పున మొత్తం 108 క్రెడిట్స్ నిర్ధేశించారు. మొదటి ఏడాది అనంతరం ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
- అర్హత: కనీసం 50శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వారు కూడా దరఖాస్తుకు అర్హులే. క్యాట్/గ్జాట్/సీమ్యాట్/జీమ్యాట్ తదితర జాతీయ పరీక్షల వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి.
- ఎంపిక: అకడమిక్‌లో చూపిన ప్రతిభ, జాతీయ పరీక్షలో సాధించిన స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022
- పర్సనల్ ఇంటర్వ్యూలు: మే 16, 2022
- మెరిట్ లిస్ట్ విడుదల: జూన్ 01, 2022
- ప్రోగ్రామ్ ప్రారంభం: జూన్ 15,2022
- వెబ్‌సైట్: https://www.nism.ac.in/
చదవండి: Admissions In Indian Statistical Institute: ఈ కోర్సులు చేసే వారికి నెలకు రూ.12,400 స్టయిఫండ్..