Skip to main content

నాలుగు క్యాంపస్‌లు, 50 కోర్సుల్లో ప్రవేశాలకు టిస్ నెట్-2021 నోటిఫికేషన్

ప్రముఖ విద్యాసంస్థ.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆప్ సోషల్ సెన్సైస్ (టిస్).. నేషనల్ ఎంట్రన్స్ టెస్టు (టిస్ నెట్- 2021)కు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పరీక్షకు హాజరై ప్రతిభ చూపడం ద్వారా టిస్ క్యాంపస్‌ల్లో (ముంబై, తుల్జపూర్, గువహటి, హైదరాబాద్) మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ లా, బీఈడీ - ఎంఈడీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ నేపథ్యంలో.. టిస్ నెట్- 2021 కు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
కోర్సులు-సీట్లు
  • ముంబై క్యాంపస్‌లో.. ఎంఏ సోషల్ వర్క్: 223 సీట్లు; ఏంఏ మేనేజ్‌మెంట్ అండ్ లేబర్ స్టడీస్: 196 సీట్లు; ఎంపీహెచ్/ఎంఏహెచ్(హెల్త్ సిస్టమ్ స్టడీస్): 140 సీట్లు; ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్:78సీట్లు; ఎంఏ(ఎడ్యుకేషన్), బీఈడీ-ఎంఈడీ ఇంటిగ్రేటెడ్: 80సీట్లు; రిహాబిటేటెడ్ స్టడీస్(ఎంఏ/ఎమ్మెస్సీ): 89సీట్లు; డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎంఏ/ఎమ్మెస్సీ): 35 సీట్లు; ఎంఏ మీడియా అండ్ కల్చరల్ స్టడీస్: 15సీట్లు; మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్: 16 సీట్లు; మాస్టర్ ఆఫ్ లా: 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • తుల్జపూర్ క్యాంపస్‌లో.. ఎంఏ/ఎమ్మెస్సీ 120 సీట్లు
  • హైదరాబాద్ క్యాంపస్‌లో ఎంఏ 216 సీట్లు
  • గువహటి క్యాంపస్‌లో ఎంఏ 75సీట్లు, ఎంఏ సోషల్ వర్క్ 60 సీట్లు

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (10+2+3 లేదా 10+2+4) ఉండాలి. 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి.
పరీక్ష విధానం: టిస్ నెట్ ఆన్‌లైన్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు.
  • టిస్ ప్యాట్: టిస్‌నెట్‌లో ప్రతిభ ఆధారంగా టిస్‌ప్యాట్ (ప్రోగ్రామ్ అప్టిట్యూడ్ టెస్ట్)కు అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తారు. దీన్ని మార్చి లేదా ఏప్రిల్ 2021లో నిర్వహిస్తారు. టిస్ ప్యాట్ 45 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. అభ్యర్థి రెండు ప్రోగ్రామ్స్‌కు దరఖాస్తు చేసుకుంటే.. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు, మూడు పేపర్లకు దరఖాస్తు చేసుకుంటే 135 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ప్యాట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
  • టిస్ మ్యాట్: ఎంఏ (హెచ్‌ఆర్‌ఎం ఎల్ - హ్యుమన్ రిసోర్స్‌మేనేజ్‌మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్) లేదా ఎంఏ (ఓడీసీఎల్- ఆర్గనైజేషన్ డవలప్‌మెంట్, ఛేంజ్ అండ్ లీడర్‌షిప్) ప్రోగ్రామ్స్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే టిస్ మ్యాట్(మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్)కు హాజ రవ్వాల్సి ఉంటుంది. నెట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా టిస్ మ్యాట్‌కు అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తారు. ఈ పరీక్షను 50 మార్కులకు 45 నిమిషాల వ్యవధిలో ఎంసీ క్యూస్, డిస్క్రిప్టివ్ రైటింగ్ కలయికగా నిర్వహిస్తారు.
  • ఓపీఐ: ప్రత్యేకంగా నిర్వహిస్తారు. టిస్ మ్యాట్/ ప్యాట్‌ల్లో ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.

తుది ఎంపిక: టిస్ నెట్-30 శాతం వెయిటేజీ; టిస్ ప్యాట్‌కు 40శాతం/టిస్ మ్యాట్: 40 శాతం వెయిటేజీ; ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ 30 శాతం వెయిటేజీ ఇచ్చి.. దాని ఆధారంగా ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2021
పోస్టు ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20
టిస్ నేషనల్ ఎంట్రెన్‌‌స టెస్టు(ఆన్‌లైన్): ఫిబ్రవరి 20

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://admissions.tiss.edu/

Photo Stories